డ్రైవర్ మృతదేహానికి ఎందుకు పోస్ట్‌మార్టం నిర్వహించలేదని వైఎస్‌ఆర్‌సీపీ నేత ఉమ్మారెడ్డి ప్రశ్నించారు.
విజయవాడ: దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో ఎవరిని కాపాడేందుకు డ్రైవర్ మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించలేదని వైఎస్‌ఆర్ సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు సూటిగా ప్రశ్నించారు. ప్రభుత్వం చెప్పినట్లు వినే సంఘాలుగా పోలీస్, ఐఏఎస్ సంఘాలు మారితే వాటి విశ్వసనీయత పోతుందని ఆయన గురువారమిక్కడ అన్నారు. వాస్తవానికి ప్రతిపక్ష నేతను ఆర్డీవో స్థాయి అధికారి రిసీవ్ చేసుకోవాలని, అలా చేయకపోగా, రివర్స్ కేసులు పెడుతున్నారని ఉమ్మారెడ్డి మండిపడ్డారు.
వైఎస్ జగన్‌పై పెట్టిన కేసులు తక్షణమే ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ నేతలు మల్లాది విష్ణు, శివాజీ, సుంకర పద్మ డిమాండ్ చేశారు. బాధితులను పరామర్శిస్తే కేసులు పెడతారా అని ప్రశ్నించారు. ఐఏఎస్‌లు, పోలీసులు రాజకీయాలకు దూరంగా ఉండాలని వారు సూచించారు.