ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు పరుచూరి అశోక్‌బాబు
సాక్షి, హైదరాబాద్: కోర్టు ఆదేశాల్ని ధిక్కరించారనే ఆరోపణల కేసులో ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు పరుచూరి అశోక్‌బాబు గురువారం హైకోర్టుకు హాజరయ్యారు. ఈమేరకు ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. హైదరాబాద్‌లోని గన్‌ఫౌండ్రిలోని ఏపీ ఎన్జీవో భవన్‌లో మీటింగ్ హాలు, 4 గదులను భాగ్యనగర్ తెలంగాణ ఎన్జీవో సంఘానికి స్వాధీనం చేయా లని హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్ని అశోక్‌బాబు అమ లు చేయలేదు.
ఇది కోర్టు ధిక్కారమే అవుతుందని భాగ్యనగర్ తెలంగాణ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించగా.. æకోర్టు ఆదేశాల మేరకు గురువారం అశోక్ బాబు విచారణకు హాజరయ్యారు. ఆయన తరఫు న్యాయవాది వాదిస్తూ, అశోక్‌బాబు దంపతు లిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు కావడం వల్ల కోర్టు నోటీసు అందుకోలేకపోయారన్నారు. పిటిషనర్ తరఫు న్యాయవాది జల్లి కనకయ్య స్పందిస్తూ, అశోక్‌బాబుకు నోటీసు అందినట్లు తమ వద్ద రశీదు ఉందన్నారు. దీనిపై కౌంటర్ పిటిషన్‌ను వారం రోజుల్లోగా దాఖలు చేయాలని ఆదేశించిన ధర్మాసనం విచారణను వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment