
సాక్షి, విజయవాడ : గ్రామ సెక్రటేరియేట్ విధానంలో పంచాయితీ రాజ్ ఉద్యోగులదే కీలకమని ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బుచ్చి రాజు అన్నారు. ఆదివారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి గా బాధ్యతలు చేపట్టిన వైయస్ జగన్మోహన్ రెడ్డి కి అభినందనలు తెలిపారు. గత ప్రభుత్వం లో తాము ఎన్నో ఇబ్బందులు పడ్డామని పేర్కొన్నారు. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రవేశపెట్టే గ్రామ సెక్రటేరియేట్ విదానంలో తమదే ముఖ్య పాత్రని అన్నారు. గ్రామ సచివాలయ వ్యవస్థ ప్రజల మన్నన పొందేందుకు కృషి చేస్తామని తెలిపారు. నిధులు, విధులు, బదలాయింపులకు ప్రభుత్వం సహకరించాలని కోరారు. పంచాయితీ రాజ్ ఉద్యోగులకు 27శాతం ఐఆర్ ఇవ్వాలని.. నిధుల దుర్వినియోగంపై రివ్యూ జరిపి చర్యలు తీసుకోవాలని సూచించారు.