రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్ర ఎమ్మెల్యేలందరూ రాష్ట్రపతికి లేఖలు ఇవ్వాలని ఏపీఎన్‌జీఓల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు సూచించారు.
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్ర ఎమ్మెల్యేలందరూ రాష్ట్రపతికి లేఖలు ఇవ్వాలని ఏపీఎన్‌జీఓల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు సూచించారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. లేఖల ద్వారా పంపిన ఎమ్మెల్యేల అభిప్రాయాలను తెలంగాణ ముసాయిదా బిల్లుపై సంతకం చేసే ముందు రాష్ట్రపతి పరిగణనలోకి తీసుకొనే అవకాశం ఉంటుందని న్యాయ నిపుణులు చెబుతున్నారన్నారు.
త్వరలోనే ఎమ్మెల్యేలందరినీ కలిసి సమైక్యాంధ్రకు అనుకూలంగా లేఖలు ఇవ్వాలని కోరనున్నట్లు తెలిపారు. అసెంబ్లీ తీర్మానాన్ని కాదని కేంద్రం పార్లమెంట్‌లో ముందుకు వెళితే ఈజిప్ట్ తరహాలో సీమాంధ్రలో అంతర్యుద్ధం వస్తుందని హెచ్చరించారు. వైఎస్‌ఆర్‌సీపీ ఈ నెల 26న హైదరాబాద్‌లో నిర్వహించనున్న సమైక్య శంఖారావం సభకు సిద్ధాంతపరంగా తమ మద్దతు ఉంటుందన్నారు. ఏపీఎన్‌జీఓస్ నేతలు చంద్రశేఖర్ రెడ్డి, పురుషోత్తం నాయుడు, బి.వి.రమణ, ఏపీఆర్‌ఎస్‌ఏ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.