హైదరాబాద్, న్యూస్‌లైన్: సీమాంధ్రలో జరుగుతున్న బంద్‌లు, ఆందోళనలు, నిరసనల నుంచి పాఠశాలు, సంక్షేమ హాస్టళ్లకు మినహాయింపు ఇవ్వాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు కోరారు. బుధవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కేవీపీఎస్, గిరిజన సంఘం, చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ.. సీమాంధ్ర ఉద్యమంలో ఎక్కువగా నష్టపోయేది బలహీన వర్గాల పిల్లలేనని ఆవేదన వ్యక్తం చేశారు.
పాఠశాలలు, హాస్టళ్లు మూతపడి సామాన్యుల పిల్లలు విద్యాపరంగా నష్టపోతుంటే, ధనవంతుల పిల్లలు చదువుతున్న కార్పొరేట్ విద్యాసంస్థలు మాత్రం నిరంతరాయంగా నడుస్తున్నాయని ఇదెక్కడి న్యాయయమని ప్రశ్నించారు. పాఠశాలలు నడిచేలా ఉపాధ్యాయ సంఘాలు చొరవ తీసుకోవాలని సూచించారు. టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన యాత్రలో స్పష్టత లేదన్నారు. మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు మాట్లాడతూ.. ఉద్యమంలో సాధారణ, మధ్యతరగతి ప్రజల పిల్లలు విద్యాపరంగా నష్టపోతున్నారన్నారు.
స్కూళ్లను సమ్మె నుంచి తప్పించండి
Published Thu, Sep 5 2013 5:42 AM | Last Updated on Sat, Sep 15 2018 4:12 PM
Advertisement