
శ్రీకాకుళానికి చంద్రబాబు వరాల జల్లు
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాకు ముఖ్యమంత్రి చంద్రబాబు వరాల జల్లు కురిపించారు. సారవకోట మండలం బొంతు వద్ద రూ. 175 కోట్లతో ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించబోతున్నట్లు ఆయన తెలిపారు. అంతేకాకుండా సారవకోట, జెలుమూరు మండలాల్లోని 40 గ్రామాల్లో రూ. 15 కోట్లతో రక్షిత మంచినీటి పథకాలు ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పారు. నరసన్నపేటలో 50 పడకల ఆస్పత్రి, చిల్డ్రన్స్ పార్క్ నిర్మాణానికి నిధులు మంజూరైనట్లు తెలిపారు. అంతేకాకుండా శ్రీకాకుళంలోని రిమ్స్ ఆస్పత్రిని రూ. 20 కోట్లతో అభివృద్ధి చేయబోతున్నట్లు తెలిపారు. మరో రూ.10 కోట్లతో పీజీ కోర్సులకు భవనాల నిర్మాణం చేపట్టబోతున్నట్లు చెప్పారు.