టాయిలెట్‌లోంచి బయటకు తీసిన శిశువును చూపెడుతున్న కార్మికుడు
తిరుపతి (అలిపిరి) : పవిత్రమైన తిరుపతి పుణ్యక్షేత్రంలో దారుణం చోటుచేసుకుంది. పురిటి బిడ్డను అత్యంత దారుణంగా మరుగుదొడ్డి బేసిన్‌లో దూర్చేశారు. శిశువు తల పట్టకపోవడంతో అలాగే వదిలి వెళ్లారు.. ఈ హృదయ విదారక సంఘటన మంగళవారం తిరుమలలో చోటుచేసుకుంది. తిరుమల ఆర్టీసీ బస్టాండులోని మరుగుదొడ్డికి వెళ్లిన భక్తులకు టాయిలెట్‌లో మృతిచెంది ఉన్న పురిటి బిడ్డ తల కనిపించింది. దీంతో కంగారుపడ్డ భక్తులు కేకలు వేసుకుంటూ బయటకొచ్చారు. విషయాన్ని భద్రతా సిబ్బంది దృష్టికి తీసుకెళ్లారు.
అనంతరం పారిశుద్ధ్య కార్మికులు వచ్చి టాయిలెట్‌లోని మృత శిశువును బయటకు తీశారు. చిన్నారి మృతదేహాన్ని చూసిన భక్తులు చలించిపోయారు. కన్నీళ్లపర్యంతమయ్యారు. అనంతరం శిశువు మృతదేహాన్ని అధికారులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. మరుగుదొడ్డిలో పురిటి బిడ్డ మృతిపై తిరుమల పోలీసులు విచారణ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment