ఉట్నూర్/బెజ్జూర్, న్యూస్‌లైన్ : జిల్లాలో మళ్లీ వలసలు మొదలయ్యాయి. ఏటా కూలీలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. గతేడాది కూడా వందల గ్రామాల నుంచి వేలాది మంది కూలీలు వలస వెళ్లారు. ఎప్పుడు మార్చి, డిసెంబర్ నెలల్లో వలసలు మొదలయ్యేవి. ఈ ఏడాది ముందుగానే ఉపాధి కోసం పొట్ట చేతపట్టుకుని రైతులు, కూలీలు పయనం అవుతున్నారు. ఈసారి జిల్లాలో, మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాలకు పంటలు నీటమునిగాయి. పంటలు కుళ్లిపోయి రెండు, మూడు సార్లు విత్తనాలు విత్తిన సరైనా దిగుబడి రాలేదు. దీంతో చేసిన అప్పులు ఎలా తీర్చాలని కొందరు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే మరికొందరు ఉపాధి కోసం పొరుగు రాష్ట్రాలకు, జిల్లాలకు వెళ్తున్నారు. పదెకరాల రైతులు కూడా కూలీలుగా మారుతున్నారు. దీనికి తోడు ప్రభుత్వం ఉపాధి హామీ పనులు చూపించలేదు. ఇటు వ్యవసాయం గిట్టుబాటక, అటు పని దొరుకక పొట్టచేత పట్టుకుని పిల్లా పాపలతో పల్లె జనం వలస బాట పడుతున్నారు.
పొరుగు ప్రాంతాలకు పయనం
తాజాగా బెజ్జూర్ మండలం ఇందిర్‌గాం, ఎల్కపల్లి, చిన్నసిద్ధాపూర్, నాగుల్వాయి, రేచిని, ఇప్పలగూడ, నాగపెల్లి గ్రామాలకు చెందిన కూలీలు వలసబాట పట్టారు. వీరితోపాటు జిల్లావ్యాప్తంగా ఉన్న ఉరిలో ఉపాధి కరువై ఏటా ముంబై, చంద్రాపూర్, కీన్వర్ట్, మెవాడ్, నాందేడ్, బల్లార్షా, యావత్మాల్, మధ్యప్రదేశ్‌లతోపాటు రాష్ట్రంలోని ఖమ్మం, గుంటూర్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ వంటి ప్రాంతాలకు వలస పోతున్నారు. వీరు వ్యవసాయ, పౌల్ట్రీ పరిశ్రలు, భవన నిర్మాణ పనుల్లో రోజువారీ కూలీలుగా కాలం వెళ్లదీస్తున్నారు. అక్కడ గుడిసెలు వేసుకుని ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ అరిగోస పడుతున్నారు.
వలస వెళ్లే గ్రామాలు ఇవే..
జిల్లా వ్యాప్తంగా ఏటా వందల గ్రామాల నుంచి కూలీలు వలస పోతున్నారు. వేమనపల్లి మండలంలో రాజారం, సుంపుటం, కల్లెంపల్లి, రాచర్ల, కెరమెరి మండలంలో ఆగర్‌వాడ, ఇంద్రానగర్, సుర్ధాపూర్, కైరి, నీంగూడ రింగన్‌ఘట్, బెజ్జూర్ మండలం నుంచి నాగుల్వాయి, సిద్ధాపూర్, జిల్లె డ, సోమిని, రంగపల్లి, బోరుగూడ, ఎల్కపల్లి, నాగపల్లి, ఏటిగూడ, కోయపల్లి, తిక్కపల్లి, నం దిగాం, తుకుడ, అంబగట్టు, పాపన్‌పెట్, కలా యి, కుంతలమానపల్లి, సులుగుపల్లి, మర్పిడి, శివపల్లి, ఎల్లూర్, ఉట్నూర్ మండలంలో వడో ని, కోలాంగూడ, ఇంద్రవెల్లి మండలంలో రాం పూర్, గోపాల్‌పూర్, ధర్మసాగర్, పాటగూడ, అందుగూడ, భుర్శన్‌పటార్, మర్కగూడ, కుభీ ర్ మండలంలో రంగశివుని, కౌటాల, సిర్పుర్ (టి) తదితర మండలాల నుంచి వేలాది మంది పిల్లపాలతో బతుకుదెరువు కోసం వలసలు పో తున్నారు. ఇంత జరుగుతున్నా ప్రజాప్రతినిధు లు, అధికారులు స్పందించడం లేదు. ఇప్పటికైనా వీరు స్పందించి వలసలను నివారించడానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
వలస బాట.. ఉపాధి వేట..
Published Mon, Nov 11 2013 3:09 AM | Last Updated on Sat, Sep 2 2017 12:30 AM
Advertisement
Advertisement