విజయవాడ: రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ వెనకడుగు వేయలేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు స్పష్టం చేశారు. మంగళవారం విజయవాడలో ప్రధాని మోదీ ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా ఆంధ్రప్రదేశ్ అంతటా అభివృద్ధిని విస్తరిస్తామన్నారు. రాష్ట్రాభివృద్ధిలో భాగంగానే ఏపీకి ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు కంభంపాటి హరిబాబు వివరించారు.