'గన్నవరం ఎయిర్ పోర్ట్ కు ఎన్టీఆర్ పేరు పెట్టుకోండి'
హైదరాబాద్: పోలవరం ముంపు మండలాలను సీమాంధ్రలో కలపాలన్నదే యూపీఏ ప్రభుత్వ నిర్ణయమని పీసీపీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు.
రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసినందుకు ప్రణబ్ కు బొత్స ధన్యవాదాలు తెలిపారు. పోలవరం అంశాన్ని టీఆర్ఎస్ రాద్దాంతం చేస్తోందని బొత్స విమర్శించారు. ఏదు కోట్ల సీమాంధ్ర ప్రజలు వ్యతిరేకించినా తెలంగాణ ఏర్పడిందని, పెద్ద మనసుతో పోలవరానికి సహకరించాలని కేసీఆర్ కు బొత్స విజ్ఞప్తి చేశారు.
మహానాడులో టీడీపీ ప్రజలకు భరోసా కల్పించడానికి బదులు కాంగ్రెస్ టార్గెట్ చేయడానికే పరిమితమైందని బొత్స అన్నారు. రాజీవ్ గాంధీ పేరుతో ఉన్న శంషాబాద్ విమానాశ్రయానికి ఎన్డీఆర్ పేరు పెడతామనడం సరికాదని బొత్స అభిప్రాయపడ్డారు. ఇలా అయితే ఐదేళ్లకొకసారి పేర్లు మార్చాల్సి వస్తుందన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజధానికి కేంద్రం నుంచి నిధులు రాబట్టాలని, విరాళాల పేరుతో బాబు కాలయాపన చేస్తోన్నారని బొత్స అన్నారు. విజయవాడ లోని గన్నవరం ఎయిర్ పోర్ట్ కు ఎన్టీఆర్ పేరు పెట్టాలని లేదా కొత్తగా వచ్చే మూడు ఎయిర్ పోర్ట్ లకు పెట్టుకోవచ్చని బొత్స సూచించారు.