ఏపీ ప్రభుత్వంపై మోడీకి ఫిర్యాదు చేయనున్న కేసీఆర్!
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకుంటున్న నిర్ణయాలను ప్రధాని నరేంద్రమోడీ దృష్టికి తీసుకువెళ్లేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు (కేసీఆర్) జూన్ 26న ఢిల్లీకి వెళ్లనున్నారు. తాజాగా విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాన్ని రద్దు చంద్రబాబు రద్దు చేయడంపై తెలంగాణ ప్రాంతంలో అనేక విమర్శలకు దారి తీస్తోంది.
కేసీఆర్‌తోపాటు తెలంగాణకు చెందిన వివిధ పార్టీల నేతలు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ సమావేశంలోనే పోలవరం ఆర్డినెన్స్‌పై ప్రధానితో చర్చించే అవకాశం ఉంది. పోలవరం ఆర్టినెన్స్ పై చర్చించేందుకు కేసీఆర్ ప్రత్యేకంగా అపాయింట్‌మెంట్ కోరినట్టు తెలుస్తోంది.
తెలంగాణ రాష్ట్రానికి సరిపడా ఐఏఎస్, ఐపీఎస్‌లను కేటాయించలేదనే విషయాన్ని ప్రధానికి కేసీఆర్ తెలపనున్నారు. సరైన అధికారుల లేకపోవడం వలన తమ ప్రభుత్వంపై తీవ్ర ప్రభావం పడుతుందనే విషయాన్ని కేసీఆర్ స్పష్టం చేసే అవకాశం ఉంది. అఖిలపక్షనేతలతో కేసీఆర్ మోడీని కలవనున్నారు.