
తమ్ముళ్ల దందా
రాజంపేట: అక్కడ అధికారులు తమ్ముళ్లకు తలవంచి పనిచేయూల్సిందే... చట్టం, నిబంధనల గురించి ఆ ప్రాంతంలో మాట్లాడకూడదు... తమ్ముళ్లు చెప్పిన మాటలకు తలూపాల్సిందే. ఏదో సొంత పనిచేసిపెట్టమని ఒత్తిడి చేస్తే అధికార పార్టీ వారు కదా అని సరిపెట్టుకోవచ్చు. అరుుతే వారు అడుతున్నది మనీ... ఏ అభివృద్ధి పని చేపట్టిన తమ మామూళ్లు ఇచ్చిన తర్వాతే మొదలు పెట్టాలంటూ హుకుం జారీ చేస్తున్నారు. లేదంటే పని ఆగిపోవాల్సిందే. కొందరు అధికారులు సైతం వారికి సహకరిస్తుండడంతో వారి పని సులువు అవుతోంది. ఇలాంటి అధికారులపై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామని సీపీఐ నాయకులు చెబుతున్నారు.
ఈ శాఖ..ఆ శాఖనికాదు..
నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఈ పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే ఆగిపోరుున పనులే ఇందుకు నిదర్శనం. వారు చెప్పినట్లు చేయకపోతే ఏదో ఒక వివాదం సృష్టించి పని సాగకుండా అడ్డుకుంటారు. పార్టీకి ఆది నుంచి పనిచేసిన కరుడుకట్టిన తెలుగుతమ్ముళ్లు దందా తమ్ముళ్ల వ్యవహారాన్ని బహిరంగగానే విమర్శిస్తున్నారు. నీటిపారుదలశాఖ, రోడ్లు భవనాల, మైన్స్ అండ్ జియాలజి, రెవిన్యూ, ఐసీడీఎస్, మున్సిపాలిటి, వైద్యఆరోగ్యశాఖ, పోలీసుశాఖ పంచాయతీరాజ్ శాఖలలో దందా తమ్ముళ్ల జోక్యం అధికం కావడంతో ఆ శాఖల అధికారులు జీర్ణించుకోలేకున్నారు.
అభివృద్ధి, సంక్షేమం అమలు విషయంలో అడ్డుగోలుగా వ్యవహారించాలని చేస్తున్న ఒత్తిడిలతో ఇక్కడి నుంచి బదిలీ చేసుకుని వెళ్లిపోవాలనే యోచనలో ఉన్నారు. మరికొందరు అధికారులు అరుుతే వారితో కలిసిపోయూరు. ఇలాంటి వారిపై గవర్నర్, ప్రభుత్వకార్యదర్శికి పిర్యాదుచేస్తామని సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య చెప్పారంటే రాజంపేట డివిజన్‌లో పరిస్ధితి ఏ విధంగా ఉందో అర్ధమవుతోంది.
నిలిచిపోయిన రూ.10కోట్ల రోడ్డు
రాజంపేట డివిజన్ పరిధిలో రాజంపేట-వత్తలూరు రోడ్డు విస్తరణలో భాగంగా సీఆర్‌ఎఫ్ కింద రూ.10కోట్లతో పనులు చేపట్టారు. 14 కిలోమీటర్ల తారురోడ్డు విస్తరణ పనులు చేయాల్సి ఉంది. ఈ పనుల దక్కించుకున్న కాంట్రాక్టరు అన్ని సమస్యలను అధిగమించి చేపట్టేసరికే ‘లోకల్’ పేరుతో వాటాలు ఇవ్వాలని మిట్టమీదపల్లెకుచెందిన తమ్ముళ్ల బృందం తేల్చి చెప్పింది. తమదైనశైలిలో బెదిరించడంతో కాంట్రాక్టరు పని నిలిపివేశారు. అయితే స్ధలం వివాదం వల్ల పనులు ఆపేయాల్సి వచ్చిందని డీఈఈ చలపతి చెబుతున్నారు.
పని ఆపడం వెనుక స్ధల సమస్య ఉన్నా... అది పుట్టింది వాటాల కోసమే అన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. గత కొద్దినెలల కింద బోయనపల్లె-బ్రహ్మణపల్లె రోడ్డు విషయంలో కూడా వాటాలు రాలేదని.. తమకు కాకుండా మరొకరి గుడ్‌విల్ ఇచ్చారని పనులు అడ్డుకున్నారు. ఇలా అభివృద్ధి పనుల పేరిటి వాటాల కోసం తమ్ముళ్లు కీచులాడుకుంటున్నారు. వాటాలు.. కమీషన్లు ఇస్తే చివరికి పనుల్లో నాణ్యత ఏ పాటి ఉంటుందో తెలిసిన విషయమే.
తమ్ముళ్ల కనుసన్నల్లో..
రాజంపేట, నందలూరు, ఒంటిమిట్ట, సుండుపల్లె, వీరబల్లి, రాజంపేట మున్సిపాలిటిలో అధికారపార్టీ తమ్ముళ్ల తమ కనుసన్నలో అభివృద్ధి పనులు జరగాలని వివిధ శాఖల అధికారులపై స్వారీ చేస్తున్నారు. చౌకదుకాణం డీలర్లు నియామయకం, ఐసీడీఎస్ అంగన్‌వాడీ పోస్టులు, ఏరియా ఆసుపత్రి, మున్సిపాలిటిలో ఔట్‌సోర్సింగ్ పోస్టులు లాంటివి తమ్ముళ్ల చెప్పిన వారికే కట్టుబెడుతున్నారు. ఏమీ చేయలేని నిస్సహాయస్ధితిలో అధికారులు ఉన్నారు.
అధికారులు, అధికార పార్టీ, లంచం,
Authorities, the ruling party, bribery