విజయమ్మ కాన్వాయ్‌పై దాడి చేసినవారిపై కేసు | Case filed against attackers on vijayamma conway | Sakshi
Sakshi News home page

విజయమ్మ కాన్వాయ్‌పై దాడి చేసినవారిపై కేసు

Published Mon, Nov 4 2013 2:48 AM | Last Updated on Mon, Jan 7 2019 8:29 PM

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఖమ్మం జిల్లా పర్యటన సందర్భంగా కాన్వాయ్‌పై దాడికి పాల్పడిన వారిమీద నేలకొండపల్లి పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది.

 నేలకొండపల్లి(ఖమ్మంజిల్లా), న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఖమ్మం జిల్లా పర్యటన సందర్భంగా కాన్వాయ్‌పై దాడికి పాల్పడిన వారిమీద నేలకొం డపల్లి పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. భారీ వర్షాలు, వరదలతో పంట నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు విజయమ్మ అక్టోబర్ 31న ఖమ్మం జిల్లాలో పర్యటించడం తెలిసిందే. ఆ సందర్భంగా నేలకొండపల్లి మీదుగా న ల్లగొండ జిల్లాలోకి వెళుతుండగా ఖమ్మం జిల్లా సరిహద్దు గ్రామమైన పైనంపల్లిలో కందుల మధు మరికొందరు కాన్వాయ్‌ను అడ్డగించి చెప్పులు, కర్రలతో దాడి చేశారు. విజయమ్మను అవమానించేలా వ్యవహరించారు.
 
 తమ పార్టీ నేతల వ్యక్తిగత స్వేచ్ఛను, కార్యకర్తల మనోభావాలను తీవ్రంగా గాయపరిచారంటూ దాడికి పాల్పడిన వారిపై వైఎస్సార్ సీపీ నాయకులు జిల్లపల్లి సైదులు, నకిరికంటి సూర్యనారాయణ, జెర్రిపోతుల అంజిని నేలకొండపల్లి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేపట్టి.. నల్లగొండ జిల్లా కోదాడకు చెందిన కందుల మధుతోపాటు మరో ఐదుగురిపై 341, 352, 355 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఎస్సై పి.సత్యనారాయణరెడ్డి ఆదివారం తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement