జనగామ టౌన్, న్యూస్‌లైన్ : హత్యలు.. లైంగికదాడుఉల.. దొంగతనాలు చేసిన నిందితులను పట్టుకుని విచారణ అనంతరం పోలీసులు కేసుకు సంబంధించిన చార్జీషీట్లు కోర్టులో దాఖలు చేస్తారు. ఆ తర్వాతే నిర్ణీత సమయంలో కోర్టుకు చట్టప్రకారం హాజరుపరుస్తారు. కానీ ఇందుకు విరుద్ధంగా ఐదేళ్లుగా జనగామ డివిజన్ పరిధిలోని ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ అధికారులు మాత్రం వివిధ కేసుల్లో పట్టుబడ్డ నిందితులకు మాత్రం చార్జీషీట్లు వేయడం లేదు. చట్టం తమ పరిధిలోకి రాదన్న విధం గా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా నిందితులు ఏళ్ల తరబడి తమ హక్కులను కోల్పోయి ముద్దాయిలుగానే జీవితాన్ని కొనసాగిస్తున్నారు.
ఎక్సైజ్ చట్టం ప్రకారం పట్టుకున్న అక్రమ మద్యం, గుడుంబా రవాణా చేసిన నిందితులకు సీఆర్‌పీసీ-167 క్రిమినల్ ప్రొసిజర్ కోడ్ ప్రకారం 60 రోజుల్లో చార్జీషీట్లు వేయాల్సి ఉంటుంది. ఎక్సైజ్ అధికారులు మాత్రం దాదాపు ఐదేళ్లు కావొస్తున్నా చార్జీషీట్లు వేయడం లేద న్న వి ష యం సమాచార హక్కు చట్టం ద్వారా వెలుగులోకి వచ్చింది. అధికారులు చట్టాన్ని ఉల్లంఘిస్తుంటే, ముద్దాయిలు వారి హక్కులను కొల్పోయి సమాజంలో ఏళ్ల తరబడి నిందితులుగానే ముద్రపడి ఉంటున్నారు. పట్టుబడిన వారిలో విద్యార్హతలు ఉన్న ముద్దాయిలపై కేసులు ఉండడంతో వారు ఉద్యోగాలకు సైతం దూరమవుతున్నారని తెలిసింది.
ఇదీ కేసుల పరంపర..
గుడుంబా సెక్షన్ 7(ఏ)ఆర్/డబ్ల్యూ/ఈ ఏపీపీ యాక్ట్ -1995 ప్రకారం... 2009-10లో 195 కేసులను నమోదు చేసిన పోలీసులు 262 మందిని, 2010-11లో 245 కేసుల్లో 405 మందిని, 2011-12లో 269 కేసుల్లో 422 మందిని, 2012-13లో 272 కేసుల్లో 424 మందిని, 2013-14లో (ఆగస్టు వరకు) 120 కేసుల్లో 192 మందిని అరెస్టు చేశారు. ఇక వైన్స్‌షాపులు, అక్రమ మద్యం సెక్షన్ 34(ఏ) ఏపీఈ యాక్ట్, 1968 ప్రకారం.. ఎక్సైజ్ అధికారులు నమోదు చేసిన కేసులు ఇలా ఉన్నాయి. 2009-10లో కేవలం ఒకేఒక కేసు నమోదు కాగా అందులో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు చెబుతున్నారు. 2010-11లో 8 కేసుల్లో 9 మంది అరెస్టయ్యూరు.2011-12లో 16 కేసుల్లో 20 మంది, 2012-13లో 43 కేసుల్లో 43 మంది, 2013 ఆగస్టు వరకు 8 కేసుల్లో 9 మంది అరెస్టయ్యూరు. ఐదేళ్లుగా సెక్షన్ 7(ఏ)ఆర్/డబ్ల్యూ/ఈ ఏపీపీ యాక్ట్ -1995 ప్రకారం.. మొత్తం 1081 కేసులకుగాను 1705 మందిని అరెస్టు చేయగా, సెక్షన్ 34(ఏ) ఏపీఈ యాక్ట్, 1968 ప్రకారం 76 కేసుల్లో 83 మందిని అరెస్టు చేశారు. ఇప్పటి వరకు ఒక్క కేసులో కూడా చార్జీషీట్లు వేయకపోవడం గమనార్హం.
జాతీయ లోక్‌అదాలత్‌ను
వినియోగించుకోలేకపోయిన అధికారులు
నవంబర్ 23న జనగామ కోర్టులో కేసుల సత్వర పరిష్కారం కోసం జాతీయ లోక్‌అదాలత్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ అవకాశాన్ని కూడా ఎక్సైజ్ అధికారులు వినియోగించుకోలేకపోయూరు. తరచూ స్టేషన్ అధికారుల బదీలీలు, పలువురి ఉద్యోగ విరమణల వల్లే కేసులను దర్యాప్తు చేయలేకపోయూమని చెబుతుండటం గమనార్హం. ఇప్పటికైనా అధికారులు చట్ట ప్రకారం ముద్దాయిలను కోర్టులో ప్రవేశపెట్టి.. ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిప్పకుండా వారి హక్కులను పరిరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
కేసులు పెట్టారు.. చార్జిషీట్లు మరిచారు..
Published Wed, Dec 11 2013 4:59 AM | Last Updated on Wed, Sep 5 2018 8:43 PM
Advertisement
Advertisement