మంత్రులతో చంద్రబాబు అత్యవసర భేటీ | Chandrababu naidu meeting with cabinet ministers at secretariat | Sakshi
Sakshi News home page

మంత్రులతో చంద్రబాబు అత్యవసర భేటీ

Published Tue, Jun 16 2015 12:32 PM | Last Updated on Sat, Aug 18 2018 8:27 PM

(ఫైల్) ఫోటో - Sakshi

(ఫైల్) ఫోటో

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు తన కేబినెట్ సహచరులతో మంగళవారం సచివాలయంలో అత్యవసరంగా భేటీ అయ్యారు. ఈ సమావేశానికి మంత్రులు అచ్చెన్నాయుడు , కిమిడి మృణాళిని, నారాయణ, యనమల  రామకృష్ణుడితో పాటు చంద్రబాబుకు అత్యంత సన్నిహితులు కేంద్రమంత్రి సుజనా చౌదరి, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ హాజరయ్యారు. అయితే అంతకు ముందు హౌసింగ్ కమిటీతో చంద్రబాబు సమావేశాన్ని అర్థాంతరం ముగించి... మంత్రులతో సమావేశమయ్యారు.

బాబుతో సమావేశంపై సమాచారం అందుకున్న మంత్రులంతా తమతమ అధికార కార్యక్రమాలన్నీ రద్దు చేసుకుని సచివాలయంలోని ముఖ్యమంత్రి ఛాంబర్కు వచ్చారు. కాగా ఈరోజు ఉదయమే చంద్రబాబు తన నివాసంలో ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఆ తర్వాత సీనియర్ మంత్రి యనమలలో బాబు సమావేశమయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement