
ఆ ముగ్గుర్నీ ఆంధ్రాకివ్వండి
తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన ఇద్దరు ఐఏఎస్‌లు, ఒక ఐపీఎస్ అధికారిని ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించాలని కోరుతూ సీఎం చంద్రబాబునాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి గురువారం లేఖ రాశారు.
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన ఇద్దరు ఐఏఎస్‌లు, ఒక ఐపీఎస్ అధికారిని ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించాలని కోరుతూ సీఎం చంద్రబాబునాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి గురువారం లేఖ రాశారు. ఈ ముగ్గురు అధికారుల కార్యదక్షత రాష్ట్రానికి ఎంతో అవసరమని లేఖలో పేర్కొన్నారు. ఐపీఎస్ అధికారులు సురేంద్రబాబు, అనురాధలను చెరో రాష్ట్రానికి కేటాయించారు. ఆ మేరకు సురేంద్రబాబును ఏపీకి, అనురాధను తెలంగాణకు కేటాయించారు. అనురాధ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఇంటెలిజెన్స్ అదనపు డీజీగా పనిచేస్తున్నారు.
ఈ నేపథ్యంలో భార్యాభర్తల అంశంగా పరిగణనలోకి తీసుకుని అనురాధను కూడా ఏపీకి కేటాయించాలని చంద్రబాబు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. జె.ఎస్.వి. ప్రసాద్‌ను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించే వీలుందని అధికారవర్గాల్లో వ్యక్తమవుతోంది. అఖిల భారత సర్వీసు అధికారుల కేటాయింపులపై అభ్యంతరాలు తెలియజేయడానికి శుక్రవారంతో గడువు ముగుస్తోంది.