ఉదయ్ కుమార్ (ఫైల్)
చిత్తూరు, చంద్రగిరి : సీఎం చంద్రబాబు మేనల్లుడు కనుమూరి ఉదయ్ కుమార్(43) శుక్రవారం తెల్లవారుజామున గుండె సంబంధిత వ్యాధితో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో మృతి చెందారు. ఆయన మృతదేహాన్ని శుక్రవారం సాయంత్రం స్వగ్రామమైన కందులవారిపల్లెకు తీసుకొచ్చారు. సీఎం సతీమణి నారా భువనేశ్వరి, నారా ఇందిర, మంత్రి లోకేష్, ఆయన సతీమణి నారా బ్రాహ్మణి శుక్రవారం సాయంత్రం కందులవారిపల్లెకు చేరుకున్నారు. మాజీ మంత్రి గల్లా అరుణకుమారి ఆ గ్రామానికి చేరుకుని ఉదయ్ మృతదేహం వద్ద నివాళులర్పించారు. శనివారం ఉదయ్ కుమార్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అంత్యక్రియలకు సీఎం చంద్రబాబు హాజరుకానున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment