సమైక్యాంధ్రకు మద్దతు ప్రకటించని పక్షంలో రాయలసీమలో చంద్రబాబునాయుడు ఆత్మగౌరవ యాత్రను అడ్డుకుంటామని శింగనమల నియోజకవర్గ వైఎస్సార్ సీపీ నాయకుడు ఆలూరు సాంబశివారెడ్డి హెచ్చరించారు.
పుట్లూరు, న్యూస్‌లైన్: సమైక్యాంధ్రకు మద్దతు ప్రకటించని పక్షంలో రాయలసీమలో చంద్రబాబునాయుడు ఆత్మగౌరవ యాత్రను అడ్డుకుంటామని శింగనమల నియోజకవర్గ వైఎస్సార్ సీపీ నాయకుడు ఆలూరు సాంబశివారెడ్డి హెచ్చరించారు. ఆదివారం మాజీ సర్పంచ్ రామకేశవరెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చి రాష్ట్ర విభజనకు కారకుడైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆత్మగౌరవ యాత్ర పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. వెంటనే స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా చేసి, వాటిని ఆమోదింపజేసుకుని, ఆ తర్వాత ఆత్మగౌరవ యాత్ర కొనసాగించాలని హితవు పలికారు.
ఆయనది ఏ వాదం అన్న విషయంపై ఆయనే ప్రజలకు స్పష్టత ఇవ్వాలని అన్నారు. తెలంగాణాకు అనుకూలంగా ఇచ్చిన లేఖను వెనక్కు తీసుకుని జై సమైక్యాంధ్ర నినాదంతో రావాలని, లేనిపక్షంలో యాత్రను రాయలసీమ ప్రజలు అడ్డుకుంటారని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఆ పార్టీ మండల కన్వీనర్ రాఘవరెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటీ మెంబర్ వెంకటరామిరెడ్డి, సర్పంచ్‌లు మహేశ్వర్‌రెడ్డి, రామకృష్ణారెడ్డి, ప్రచార కమిటీ కన్వీనర్ కంచెం శ్రీనివాసులరెడ్డి, సేవాదళ్ కన్వీనర్ ధనుంజయనాయుడు తదితరులు పాల్గొన్నారు.