
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి మెగాస్టార్ చిరంజీవి కృతజ్ఞతలు తెలిపారు. లాక్‌డౌన్‌తో ఇబ్బందుల్లో ఉన్న సినీ పరిశ్రమకు మేలు కలిగే నిర్ణయాలతో పాటు.. సింగిల్ విండో అనుమతులకు జీవో విడుదల చేసినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ మేరకు ఆదివారం సీఎం జగన్‌కు ఫోన్ చేశారు. లాక్‌డౌన్ ముగిసిన తర్వాత సినీ పరిశ్రమ సమస్యలపై చర్చించేందుకు కలుద్దామని సీఎం జగన్ చెప్పారని, అన్ని విభాగాల ప్రతినిధులతో త్వరలోనే ముఖ్యమంత్రిని కలుస్తామని ట్విటర్ వేదికగా చిరంజీవి ప్రకటించారు. (సినిమా పరిశ్రమ బతకాలి)
కాగా సినీ పరిశ్రమల సమస్యలపై చర్చించేందుకు టాలీవుడ్ ప్రముఖులు శనివారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనూ భేటీ అయిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్ కారణంగా నిలిచిపోయిన షూటింగ్స్‌ను కొనసాగించే విధంగా అనుమతులు ఇవ్వాలని కేసీఆర్‌ను కోరారు. దీనికి స్పందించిన కేసీఆర్ దశల వారీగా అనుమతులు ఇస్తామని తెలిపారు. (దశల వారీగా షూటింగ్స్‌కు అనుమతి: కేసీఆర్)
Comments
Please login to add a commentAdd a comment