పూర్తిస్థాయి బ్యాంకుగా ‘స్త్రీ నిధి’: సీఎం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘స్త్రీ నిధి’ పథకాన్ని రానున్న కాలంలో పూర్తిస్థాయి బ్యాంకుగా మార్చాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. శనివారం సీఎం నివాసంలో స్వయం సహాయక సంఘా లపై సమీక్ష జరిగింది. స్త్రీనిధి పథకం కింద రూ.1,100 కోట్లు అందించాలని లక్ష్యం పెట్టుకోగా.. ఇప్పటికి రూ.682 కోట్లు అందించామని, సెర్ప్ సీఈవో కృష్ణమోహన్ చెప్పారు.
వచ్చే ఆర్థిక సంవత్సరంలో స్త్రీ నిధి పథకాన్ని బహుళ ప్రయో జనాలు అందించే పథకంగా మలచాలని అధికారులకు సీఎం సూచించారు. ఇదిలా ఉండగా, పసుపు–కుంకుమ పథకం కింద స్వయం సహాయక సంఘాల్లోని 82,13, 281 మంది సభ్యులకు రూ.4,971.94 కోట్ల నిధులు అందించినట్లు చెప్పారు.