
సాక్షి, విశాఖ : గ్యాస్ లీకేజీ సంఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం ఉన్నత అధికారులతో సమీక్ష నిర్వహించారు. సంఘటనపై అధికారులతో చర్చించారు. గ్యాస్ లీకేజీ, అనంతరం తీసుకున్న చర్యలను జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వివరించారు. గ్యాస్ లీక్ ఘటనలో ఇప్పటివరకు 9 మంది చనిపోయినట్లు తెలిపారు.
అంతకు ముందు సీఎం జగన్ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. దుర్ఘటనపై బాధితులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. కాగా ఆర్‌ఆర్ వెంకటాపురంలోని ఎల్‌జీ పాలిమర్స్ పరిశ్రమలో రసాయన వాయువు లీకైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో తొమ్మిది మంది మృతి చెందగా.. దాదాపు 200 మంది అస్వస్థతకు గురయ్యారు. (గ్యాస్ లీక్ బాధితులను పరామర్శించిన సీఎం జగన్)