Corona in Andhra Pradesh: సీఎం జగన్‌: లక్ష పడకలు సిద్ధం చేయాలి | YS Jagan Review Meeting on Corona Control - Sakshi Telugu
Sakshi News home page

ప్రతి సచివాలయాన్ని ఒక యూనిట్‌గా తీసుకోవాలి

Published Sat, May 2 2020 4:47 PM | Last Updated on Sat, May 2 2020 7:21 PM

CM YS Jagan Review Meeting On Corona Control Measures - Sakshi

సాక్షి,అమరావతి:  ప్రతి గ్రామ సచివాలయాన్ని ఒక యూనిట్‌గా తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. సచివాలయంలో కనీసం 10 నుంచి 15 మందికి క్వారంటైన్‌ వసతి కల్పించాలని తెలిపారు. భోజనం, సదుపాయాలు, బెడ్లు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. కరోనా నియంత్రణ చర్యలపై శనివారం తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. కరోనా పరిస్థితుల కారణంగా వివిధ రాష్ట్రాల్లో, విదేశాల్లో   చిక్కుకుపోయిన వారు తిరిగి వస్తున్న నేపథ్యంలో అనుసరించాల్సిన విధానంపై సమావేశంలో చర్చ  జరిగింది. డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు, అగ్రిమిషన్‌ వైస్‌ చైర్మన్‌ నాగిరెడ్డి, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్,  వైద్యారోగ్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌ రెడ్డి సహా ఇతర అధికారులు హాజరయ్యారు.
(సీఎం జగన్‌కు ధన్యవాదాలు: నవీన్‌ పట్నాయక్‌) 

కనీసం లక్ష పడకలు సిద్ధం చేసుకోవాలి..
కనీసం లక్ష పడకలు సిద్ధం చేసుకోవాలని సీఎం ఆదేశించారు. అంగన్‌వాడీలు, మెప్మా, పంచాయతీరాజ్‌ శాఖ  గ్రామాల్లో కరోనా క్వారంటైన్‌ చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. కనీసం 500 ఆర్టీసీ బస్సులను నిత్యావసరాలను తీసుకెళ్లే మొబైల్‌ వాహనాలుగా మార్చాలని సీఎం ఆదేశించారు. ఇందులోనే వీలైనంత వరకు ఫ్రీజర్లు ఏర్పాటుచేసి పాలు, పెరుగు, గుడ్లు, పండ్లు, లాంటి నిత్యావసరాలను ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. కేసుల తీవ్రత ఉన్న క్లస్టర్లలో ప్రజల కదలికలను కట్టడి చేసి నిత్యావసరాల కోసం ఒక వ్యక్తికే పాసు ఇవ్వాలని సీఎం తెలిపారు. వైద్యుడు, ఏఎన్‌ఎం,ఆశా కార్యకర్త, మందులు కూడా మొబైల్‌ యూనిట్‌కు అందుబాటులో ఉంచాలని సీఎం అన్నారు.
(మనసున్న మా రాజు సీఎం)

లాక్‌డౌన్‌ పొడిగింపు, కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలపై సమీక్ష
కేంద్ర హోంశాఖ ఇచ్చిన సూచనల మేరకు ఎక్కడెక్కడ కంటెన్‌మెంట్‌ జోన్లు ఉండాలన్న దాన్ని గుర్తించి, అక్కడ అనుసరించాల్సిన విధానాలపై విధివిధానాలు తయారుచేయాలని అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు. అనుమతులు ఉన్న దుకాణాల వద్ద పాటించాల్సిన ఎస్‌ఓపీలను ఇవ్వాలని సీఎం తెలిపారు.

క్వారంటైన్‌ కేంద్రాల్లో సదుపాయాలపై సీఎం ఆరా..
‘‘ రాష్ట్రంలో మొత్తం కరోనా పరీక్షల సంఖ్య లక్షా 8వేల 403. నిన్న ఒక్క రోజే 5,943 మందికి పరీక్షలు. ప్రతి పది లక్షల మందిలో 2030 మందికి పరీక్షలు. పాజిటివిటీ కేసుల రేటు 1.41 శాతం.. దేశవ్యాప్తంగా 3.82శాతం. రాష్ట్రంలో మరణాల శాతం 2.16 శాతం, దేశవ్యాప్తంగా 3.28శాతం క్వారంటైన్లలో సదుపాయాలపై అభిప్రాయాలు తెలుసుకున్నారా లేదా అని’’ సీఎం ఆరా తీశారు. సమస్యలపై ఎలాంటి చర్యలు తీసుకుంటారన్న దానిపై తనకు తెలియజేయాలని సీఎం ఆదేశించారు. 

విధి విధానాలు ఖరారు చేయాలి..
మే 30న రైతు భరోసా కేంద్రాలు ప్రారంభానికి  సన్నాహాలు చేస్తున్నామని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ఈలోగా మార్కెట్‌ ఇంటెలిజెన్స్‌ వ్యవస్థను బలోపేతం చేయాలని సీఎం సూచించారు. రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిల్లో వ్యవసాయ సలహా బోర్డుల ఏర్పాటుపై విధి విధానాలు ఖరారు చేయాలని సీఎం పేర్కొన్నారు. వీటిని ఆర్బేకేలకు అనుసంధానం చేయాలని సూచించారు. జూన్‌ 6న మత్స్యకార భరోసాకు సిద్ధం అయ్యామని సీఎం కు అధికారులు తెలిపారు. రైతు భరోసాకు సంబంధించి గ్రామ సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితా ఉంచుతున్నామని.. ఎవరైనా పేరు లేకపోతే దరఖాస్తు చేసుకునేలా ప్రచారం చేస్తున్నామని అధికారులు వెల్లడించారు. ప్రతి పంటలోనూ ప్రభుత్వం తరపున ఎంత కొనుగోలు చేయాల్సి ఉంటుంది, ఆ మేరకు రోజువారీగా సేకరణ ఎంతచేయాలి? చేస్తున్నారా? లేదా? అన్నదానిపై వివరాలు ఇవ్వాలని అధికారులను సీఎం కోరారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం తేమ కొలిచే సాధనాలను అందుబాటులో ఉంచాలని.. వీటిని ప్రతి రైతు భరోసా కేంద్రం వద్ద ఉంచాలని అధికారులను సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement