రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 21న కలెక్టరేట్‌ను ముట్టడించనున్నట్లు బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) తెలిపింది.
అనంతపురం: రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 21న కలెక్టరేట్‌ను ముట్టడించనున్నట్లు బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) తెలిపింది. బీఎస్పీ అనంతపురం జిల్లా ఉపాధ్యక్షుడు బాలకృష్ణ, ధర్మవరం నియోజవర్గ మైనారిటీ సెల్ నేత రియాజ్, అలాగే జిల్లా నాయకులు భాస్కర్‌లు తాడిమర్రి మండల కేంద్రంలో శనివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. రైతు సమస్యలపై ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 21న కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని వారు తెలిపారు.