విభజనపై కాంగ్రెస్ కుట్ర రాజకీయాలు: ఏబీకే ప్రసాద్
విభజనపై కాంగ్రెస్ కుట్ర రాజకీయాలు: ఏబీకే ప్రసాద్
Published Mon, Nov 4 2013 6:32 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
రాష్ట్ర విభజన అంశంపై కాంగ్రెస్ పార్టీ కుట్ర రాజకీయాలు చేస్తోంది అని సీనియర్ జర్నలిస్ట్ ఏబీకే ప్రసాద్ ఆరోపించారు. విభజన విషయంలో రాజకీయ పార్టీలను దోషులుగా చిత్రీకరించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది అని ఏబీకే మండిపడ్డారు.
పార్లమెంట్ లో బిల్లు పెట్టే సమయంలో అఖిలపక్షాన్ని పిలవడం ఎందుకు అని ఏబీకే ప్రశ్నించారు. విభజన నిర్ణయం తీసుకున్నాక, అఖిలపక్ష సమావేశాన్ని పిలువడంపై ఏబీకే అభ్యంతరం లేవనెత్తారు. విభజన నేరాన్ని రాజకీయ పార్టీలపైకి నెట్టి కాంగ్రెస్ వైట్ కాలర్ గా బయటపడేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
Advertisement
Advertisement