‘కార్యకర్తల అభీష్టం మేరకే వైఎస్‌ఆర్‌ సీపీలోకి’ | congress ex mla pamula rajeswaridevi joins ysrcp, more leaders to follow | Sakshi
Sakshi News home page

‘కార్యకర్తల అభీష్టం మేరకే వైఎస్‌ఆర్‌ సీపీలోకి’

Published Sat, Apr 22 2017 12:26 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

‘కార్యకర్తల అభీష్టం మేరకే వైఎస్‌ఆర్‌ సీపీలోకి’ - Sakshi

‘కార్యకర్తల అభీష్టం మేరకే వైఎస్‌ఆర్‌ సీపీలోకి’

హైదరాబాద్‌ : రాష్ట్రం విడిపోవడానికి కాంగ్రెస్‌ పార్టీనే కారణమని పి.గన్నవరం మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరీదేవి అన్నారు. ఆమె శనివారం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రాజేశ్వరీదేవి మాట్లాడుతూ రాష్ట్రం విడిపోవడంతో తమ కార్యకర్తలంతా మనస్తాపం చెందారన్నారు. వారిందరు తనను వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి వెళ్లాలని కోరారని, వారి మనోభావాలకు అనుగుణంగా పార్టీలో చేరినట్లు వెల్లడించారు. వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నాయకత్వంలో పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తానని రాజేశ్వరీదేవి తెలిపారు. ఆమెతో పాటు పలువురు వైఎస్‌ఆర్‌ సీపీలో చేరారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement