తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరిదేవి శనివారం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
హైదరాబాద్ : తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరిదేవి శనివారం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో రాజేశ్వరీదేవి తన అనుచరవర్గంతో కలిసి పార్టీలో చేరారు. వైఎస్ జగన్ ఈ సందర్భంగా ఆమెకు పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. పి.గన్నవరం నియోజకవర్గం నుంచి రాజేశ్వరీదేవి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన విషయం తెలిసిందే.