విద్యుదాఘాతంతో కాంట్రాక్ట్ ఉద్యోగి మృతి | Contract worker dies after falling from electric pole | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో కాంట్రాక్ట్ ఉద్యోగి మృతి

Published Fri, Nov 6 2015 6:14 PM | Last Updated on Wed, Apr 3 2019 8:07 PM

Contract worker dies after falling from electric pole

నంద్యాల: విద్యుత్ స్తంభంపై పనులు నిర్వహిస్తున్న సమయంలో విద్యుత్ ప్రసారం కావడంతో ఓ కాంట్రాక్టు ఉద్యోగి ప్రాణాలు కోల్పోయాడు. కర్నూలు జిల్లా నంద్యాల బైపాస్ రోడ్డులో శుక్రవారం ఈ దుర్ఘటన జరిగింది.

వెంకటేశ్వర్లు అనే కాంట్రాక్ట్ ఉద్యోగి శుక్రవారం మధ్యాహ్నం విద్యుత్ స్తంభంపై పని చేస్తున్నాడు. అతనికి తెలియకుండా విద్యుత్ ప్రసారాన్ని ఆన్ చేయడంతో వెంకటేశ్వర్లు షాక్‌కు గురై స్తంభంపై మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మృతుడి బంధువులు ట్రాన్స్‌కో కార్యాలయానికి చేరుకుని ఆందోళనకు దిగారు. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. తక్షణమే పరిహారంతో పాటు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇప్పించాలని డిమాండ్ చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement