అవినీతిలో కూరుకుపోయిన కార్పొరేషన్ | Corruptionbogged Corporation | Sakshi
Sakshi News home page

అవినీతిలో కూరుకుపోయిన కార్పొరేషన్

Published Thu, Apr 7 2016 4:39 AM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM

అవినీతిలో కూరుకుపోయిన కార్పొరేషన్ - Sakshi

అవినీతిలో కూరుకుపోయిన కార్పొరేషన్

నగర ఎమ్మెల్యే డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్

నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట) : నెల్లూరు నగరపాలకసంస్థ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని నగర ఎమ్మెల్యే డాక్టర్ పి.అనిల్‌కుమార్‌యాదవ్ అన్నారు. స్థానిక ఉడ్‌హౌస్‌సంఘం, శెట్టిగుంటరోడ్డు ప్రాంతాల్లో ఎమ్మెల్యే అనిల్, డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాధ్‌లు పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం 6వ డివిజన్‌లోని ఎల్‌వీ రమణారెడ్డి లే అవుట్‌లో రూ.3 లక్షలతో నిర్మిస్తున్న మంచినీటి పైప్‌లైన్ పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ మాట్లాడుతూ  గతంలో చంద్రబాబునాయుడు ప్రభుత్వంలో ఒకరు చనిపోతే మరొకరికి పింఛన్లు వచ్చేవని, ప్రస్తుతం అదే పరిస్థితి కొనసాగుతోందన్నారు. 4వేల పింఛన్లు పెండింగ్‌లో ఉన్నాయని, ఒక్కో వార్డుకు 150 చొప్పున 54 డివిజన్‌లలో మొత్తం 8 వేల పింఛన్లు పెండింగ్‌లో ఉన్నాయన్నారు.

జన్మభూమిలో 10 మందికి ఇచ్చి చేతులు దులుపుకోకుండా, కార్పొరేషన్ కార్యాలయంలో పింఛన్ సమస్యలకు ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేసి ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు ఉన్న అర్హులైన వారికి వెంటనే మంజూరు చేయాలన్నారు. వేసవి దృష్ట్యా తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలన్నారు. పారిశుద్ధ్య కార్మికులు అధికారులు, నాయకుల ఇళ్లలో పనులు చేయడం దారుణమన్నారు. అధికారులు స్పందించి 150 మంది కార్మికులను వెనక్కి పిలిపించి ప్రజలకు సేవ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.

డిప్యూటీ మేయర్ ద్వారకానాధ్ మాట్లాడుతూ 6వ డివిజన్‌లో రూ.70 లక్షలతో పనులు చేయాల్సి ఉన్నా ఇంతవరకు రూ.10 లక్షలకు మించలేదన్నారు. కార్పొరేషన్‌కు ఎక్కువగా పన్నులు వసూలు అవుతాయని, ఆ ప్రాతిపదికన డివిజన్‌ను అభివృద్ధి చేయాలన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు ఓబిలి రవిచంద్ర, దేవరకొండ అశోక్, నాయకులు వందవాశి రంగ, వేలూరు మహేష్, అడపా శ్రీధర్, వంశీ, మద్దినేని శ్రీధర్, బి.సత్యకృష్ణ, నారాయణ, తులసి, వివేకా, వీరబ్రహ్మం, సంక్రాంతి కల్యాణ్, పెళ్లూరు శ్రీనివాసులు, పఠాన్ ఫయాజ్‌ఖాన్, ఉప్పాల శేషుగౌడ్, పి.అఖిల్ పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement