విజయనగరంలో విధించిన కర్ఫ్యూను మంగళవారం ఉదయం గంటపాటు సడలిస్తున్నట్లు ఆ జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే తెలిపారు.
తీవ్రస్థాయిలో చెలరేగిన ఆందోళనల ఫలితంగా తొలిసారి విజయనగరంలో విధించిన కర్ఫ్యూను మంగళవారం ఉదయం గంటపాటు సడలిస్తున్నట్లు ఆ జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే తెలిపారు. మంగళవారం ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు కర్ఫ్యూ సడలిస్తున్నామని, ఆ సమయంలో ప్రజలంతా నిత్యావసరాలు, మందులు, కొనుగోలు చేసుకోవచ్చని, పెట్రోల్ బంకులు కూడా తెరుచుకోవచ్చని ఆయన అన్నారు.
కర్ఫ్యూ సడలింపును ఉపయోగించుకుని జిల్లాలో శాంతియుత పరిస్థితులు నెలకొనేలా ప్రజలు సహకరించాలని కలెక్టర్ కోరారు. విద్యుత్ ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో పట్టణంలో మంచినీటి కొరత ఏర్పడిన మాట వాస్తవమేనని, అయితే విశాఖపట్నం నుంచి హైపవర్ జనరేటర్ తెప్పించి ఒకటి రెండు రోజుల్లో నీటిసరఫరాను పునరుద్ధరిస్తామని కలెక్టర్ వివరించారు.