రవాణా శాఖలో భారీగా బదిలీలు | Department of Transportation heavily on transfers | Sakshi
Sakshi News home page

రవాణా శాఖలో భారీగా బదిలీలు

Published Fri, Aug 28 2015 2:46 AM | Last Updated on Thu, May 24 2018 1:57 PM

Department of Transportation heavily on transfers

డెప్యూటీ కమిషనర్‌గా పి.సుందర్ నియామకం
ఎస్.వెంకటేశ్వరరావు విశాఖకు బదిలీ
నందిగామ ఆర్టీవోగా మూర్తి


విజయవాడ : రవాణా శాఖలో భారీగా బదిలీలు జరిగాయి. జిల్లా డెప్యూటీ కమిషనర్ మొదలుకొని అసిస్టెంట్ మోటర్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ కేడర్ వరకు సుమారు 50 మంది ఉద్యోగులను బదిలీ చేస్తూ రవాణా శాఖ కమిషనర్ ఎన్.బాలసుబ్రహ్మణ్యం బుధవారం రాత్రి ఉత్తర్వులు వెలువరించారు. జిల్లాలో ప్రస్తుతం డెప్యూటీ కమిషనర్‌గా ఉన్న ఎస్.వెంకటేశ్వరరావును విశాఖపట్నం జిల్లాకు బదిలీ చేశారు. ఆయన స్థానంలో అనంతపురంలో డెప్యూటీ కమిషనర్‌గా పనిచేస్తున్న వి.సుందర్‌ను నియమించారు. విజయవాడలో రవాణా శాఖ అధికారిగా పనిచేస్తున్న వి.సిరి ఆనంద్‌ను రాజమండ్రికి, గుడివాడ రవాణా శాఖ అధికారిగా పనిచేస్తున్న డీఎస్‌ఎన్ మూర్తిని నందిగామకు బదిలీ చేశారు.

 బ్రేక్ ఇన్‌స్పెక్టర్ల బదిలీలు ఇలా...
 మోటర్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ల బదిలీలు పరిశీలిస్తే.. కాకినాడలో పనిచేస్తున్న ఎ.వి.రవికుమార్‌ను గరికపాడు చెక్‌పోస్ట్‌కు, వైవీఎన్ మూర్తిని విజయవాడకు, డి.ఎస్.సురేంద్ర సింగ్ నాయక్‌ను నందిగామకు బదిలీ చేశారు. మండపేటలో పనిచేస్తున్న వి.పద్మాకర్‌ను విజయవాడకు, పాలకొల్లులో పనిచేస్తున్న పి.శేషగిరిరావును ఉయ్యూరుకు, తణకులో పనిచేస్తున్న పి.సీతాపతిరావును మచిలీపట్నానికి, భీమవరంలో పనిచేస్తున్న వి.ఎస్.జానకి రామన్‌ను విజయవాడకు, విజయవాడలో పనిచేస్తున్న జి.ఆర్.రవీంద్రనాథ్‌ను భీమవరానికి, జి.నాగమురళిని ఏలూరుకు, ఎం.వి.నారాయణరాజును జగ్గయ్యపేటకు, విజయవాడలో పనిచేస్తున్న కె.ఆర్.రవికుమార్‌ను గుడివాడకు, గుడివాడలో పనిచేస్తున్న కె.జయపాల్‌రెడ్డిని ఏలూరుకు, గుడివాడలో పనిచేస్తున్న వై.నాగేశ్వరరావును నూజివీడుకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. కొన్ని కీలక స్థానాల్లో దీర్ఘకాలంగా ఉన్న కొందరికి మాత్రం రాజకీయ సిఫార్సులతో బదిలీల్లో మినహాయింపు ఇవ్వటం గమనార్హం.

 అసిస్టెంట్ మోటర్ వెహికల్  ఇన్‌స్పెక్టర్ల బదిలీలు ఇలా...
 అసిస్టెంట్ మోటర్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ల బదిలీలను పరిశీలిస్తే.. విజయవాడలో పనిచేస్తున్న జి.వి.ఎస్.ఎన్.మూర్తిని నందిగామకు, జె.నారాయణ స్వామిని ఉయ్యూరుకు, వై.శేషుబాబును కాకినాడకు, ఆర్.రాజేష్ కుమార్‌ను విజయవాడలో వేరే డివిజన్‌కు, బి.చల్లారావును గరికపాడుకు, డి.శ్రీకాంత్ బాబును తీటగుంటకు, టి.రాంబాబును జీలుగుమల్లికి, ఎం.పూర్ణిమను గరికపాడుకు, ఆజ్మీరా బద్దును తీటగుంటకు, ఎన్.ఎల్.సుబ్బలక్ష్మిని గుడివాడకు, గుడివాడలో పనిచేస్తున్న టి.వి.కృష్ణవేణిని విజయవాడకు, గరికపాడు చెక్‌పోస్ట్‌లో పనిచేస్తున్న వి.ఎస్.వి.ఎస్.నాయుడును విజయవాడకు, ఎ.కాశీ ఈశ్వరరావును ఏలూరుకు, డి.సోనీప్రియను విజయవాడకు, మచిలీపట్నంలో పనిచేస్తున్న బి.వినోద్ కుమార్‌ను ఏలూరుకు, జగ్గయ్యపేటలో పనిచేస్తున్న ఎస్.వి.వి.సత్యనారాయణను తీటగుంటకు, రాజమండ్రిలో పనిచేస్తున్న కె.ప్రసాద్‌ను విజయవాడకు, తీటగుంట చెక్‌పోస్ట్‌లో పనిచేస్తున్న ఎం.రవికుమార్, ఎస్.గౌరిశంకర్‌లను విజయవాడకు బదిలీ చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement