రవాణాశాఖలో భారీ బదిలీలు
సాక్షి, హైదరాబాద్: రవాణా శాఖలో భారీ ఎత్తున బదిలీలు జరిగారుు. జాయింట్ ట్రాన్‌స పోర్ట్ కమిషనర్లు, రవాణా అధికారులు, మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లు, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లు, సూప రింటెండెంట్లు ... అన్ని కేడర్లలో 200 మందికి స్థానచలనం కలిగింది. నాలుగేళ్లుగా బదిలీలు లేక పోవటం.. కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో కనీ సం మూడేళ్లుగా ఒకేచోట పనిచేస్తున్న వారిని బదిలీ చేశారు. ప్రధాన కార్యాలయంలో జాయింట్ ట్రాన్‌స పోర్ట్ కమిషనర్(జేటీసీ)గా ఉన్న పాండురంగ నాయక్‌కు హైదరాబాద్ సిటీ జేటీసీగా బదిలీ చేసి అక్కడ పనిచేస్తున్న రఘునాథ్‌ను ప్రధాన కార్యాలయానికి మార్చారు.
8 మంది ఆర్టీవోలను బదిలీ చేశారు. 4 ఖాళీలు పోను రాష్ట్రంలో మొత్తం 18 మంది ఆర్టీవోలుండగా 8 మందిని బదిలీ చేశారు. జోన్ ఐదు, ఆరులకు సంబంధించి 50 మంది మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్లు, 110 మంది ఏఎంవీఐలను బదిలీ చేశారు. ఇటీవలే శిక్షణ పూర్తిచేసుకున్న 43 మందికి పోస్టింగ్‌స ఇచ్చారు. జోన్ ఐదు, ఆరులకు సంబంధించి 19 మంది సూపరింటెండెంట్లకు కూడా స్థానచలనం కలిగింది. అరుుతే కొందరు కోరుకున్న చోట పోస్టింగ్‌స దక్కినట్టు తెలుస్తోంది. ఈ విషయంలో భారీగా డబ్బులు చేతులు మారాయనే ఆరోపణలు వినిపిస్తున్నారుు.