మన కోసం.. జగన్‌ను సీఎం చేద్దాం | development on the state in ys jagan hands | Sakshi
Sakshi News home page

మన కోసం.. జగన్‌ను సీఎం చేద్దాం

Published Fri, Apr 4 2014 3:15 AM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

మన కోసం..   జగన్‌ను సీఎం చేద్దాం - Sakshi

మన కోసం.. జగన్‌ను సీఎం చేద్దాం

కోనేరుసెంటర్ (మచిలీపట్నం), న్యూస్‌లైన్ : జెడ్‌పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలతో పాటు  సార్వత్రిక ఎన్నికల్లోనూ  వైఎస్సార్‌సీపీ అఖండమెజార్టీతో గెలుపొందటం ఖాయమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  ప్రచార కమిటీ రాష్ట్ర కన్వీనర్ టి.ఎస్.విజయచందర్ అన్నారు. మనకోసం, మన పిల్లల అభివృద్ధికోసం రాబోయే అన్ని ఎన్నికల్లోనూ వైఎస్సార్ సీపీకి అఖండ మెజార్టీ  చేకూర్చి అధినేత జగన్‌మోహనరెడ్డిని సీఎం చేసేందుకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని  కోరారు.
 
మచిలీపట్నం  పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త కుక్కల విద్యాసాగర్ కార్యాలయంలోనూ, పెడన పార్టీ కార్యాలయంలోనూ గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 49 జెడ్‌పీటీసీ  స్థానాల్లో 40 నుంచి 45 స్థానాలను వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంటుందనే ధీమా  వ్యక్తం చేశారు. అలాగే 30 ఎంపీ స్థానాలను గెలవటం తథ్యమన్నారు.  

జీవితంలో నిజాలు పలకని చంద్రబాబునాయుడు లేనిపోని హామీలతో  ప్రజలను మరోమారు మోసగించేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో భ్రష్టుపట్టిపోయిన కుళ్లు రాజకీయాలకు చరమగీతం పాడి దివంగత మహానేత డాక్టర్ వైఎస్.రాజశేఖర్‌రెడ్డి పాలన కావాలని కోరుకునే ప్రతి ఒక్కరూ కులమతాలకతీతంగా వైఎస్సార్‌సీపీకి అఖండమెజార్టీని చేకూర్చేందుకు సిద్ధంగా ఉండాలని కోరారు.  
 
చిరంజీవి, పవన్ కల్యాణ్ రాజకీయరంగంలో ఐరన్‌లెగ్‌లుగా మిగిలిపోతారన్నారు. కుక్కల విద్యాసాగర్ మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ ప్రచార కమిటీ కన్వీనర్ విజయ్‌చందర్ పర్యటనతో జిల్లాలో వైఎస్సార్‌సీపీ మరింత బలపడుతుందన్నారు. ఎన్నో ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోని బందరు పోర్టును  అభివృద్ధి పరచడమే ఎంపీగా తన  ధ్యేయమని చెప్పారు.

పెడన పార్టీ కార్యాలయంలో పెడన నియోజకవర్గ సమన్వయక ర్త ఉప్పాల రాం ప్రసాదు, ఉప్పాల రాము, మావులేటి వెంకట్రాజు విజయ్‌చందర్‌ను ఘనంగా సత్కరించారు.పార్టీ ప్రచార కమిటీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ జొన్నల శ్రీనివాసరెడ్డి, పెడన నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ నాయకుడు మావులేటి వెంకట్రాజు, వీణం రాము, శింగంశెట్టి రాంబాబు  పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement