పొన్నూరు(చేబ్రోలు), న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన అభివృద్ధికి ఆటంకమని మాజీ మంత్రి కోడెల శివప్రసాదరావు అన్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా పొన్నూరు ఎమ్మెల్యే డి.నరేంద్రకుమార్ శనివారం నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు. ముందుగా తహశీల్దారు కార్యాలయం నుంచి ఐలాండ్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు, సమైక్యవాదులు, టీడీపీ నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు. దీక్ష శిబిరం వద్ద మాజీ మంత్రి కోడెల మాట్లాడుతూ ఉత్తరాంఛల్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల విభజన వలన నక్సల్స్, శాంతిభద్రతల సమస్యలు ఏర్పడ్డాయన్నారు. తెలంగాణ అంశం రాజకీయ నాయకుల ప్రేరేపితమేనన్నారు.
రాష్ట్ర విభజనపై సీమాంధ్రలో అట్టడుగు ప్రజల నుంచి నిరసన వ్యక్తమవుతోదన్నారు. అనంతరం ఎమ్మెల్యే నరేంద్రకుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందే సాగునీటి సమస్యలు తలెత్తాయన్నారు. రాష్ట్ర విభజన జరిగితే సీమాంధ్ర ఎడారిగా మారుతుందన్నారు. ఆయనకు పలువురు నాయకులు సంఘీభావం ప్రకటించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి, టీడీపీ నాయకులు కేసన శంకరరావు, మన్నవ సుబ్బారావు, డీసీఎంఎస్ చైర్మన్ ఇక్కురి ్త సాంబశివరావు పాల్గొన్నారు.
విభజనతో అభివృద్ధికి ఆటంకం
Published Sun, Aug 18 2013 4:15 AM | Last Updated on Fri, Aug 10 2018 9:40 PM
Advertisement
Advertisement