డీఎస్సీ అభ్యర్థులకు ఓటీపీలొచ్చేశాయ్ | DSC candidates to Otp | Sakshi
Sakshi News home page

డీఎస్సీ అభ్యర్థులకు ఓటీపీలొచ్చేశాయ్

Published Mon, May 30 2016 2:29 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

DSC candidates to  Otp

నేడు, రేపు ఆన్‌లైన్ ఆప్షన్లకు  అవకాశం
జూన్ 1న విజయవాడలో ప్రతిజ్ఞ
3 నుంచి 11 వరకు శిక్షణ

 

చిత్తూరు(గిరింపేట): జిల్లాలో డీఎస్సీ-2014 ద్వారా ఎంపికైన టీచర్ల సెల్‌ఫోన్లకు వన్‌టైం పాస్‌వర్డు(ఓటీపీ)ని రాష్ట్ర విద్యాశాఖ ఆదివారం సంబంధిత అభ్యర్థుల సెల్‌ఫోన్లకు మెసేజ్ పంపింది. డీఎస్సీలో ఎంపికైన ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్, భాషా పండితులు, పీఈటీల్లో 20మందికి ఓటీపీ అందకపోవడంతో వారు డీఈవో కార్యాలయాన్ని సంప్రదించారు. డీఈవో నాగేశ్వరరావు రాష్ట్ర విద్యాశాఖతో సంప్రదించి మధ్యాహ్నం 3 గంటలకు వారందరికీ ఓటీపిని అందజేశారు. జూన్ 1 లోపు అభ్యర్థులకు ఎంపిక స్థలాలను తెలియజేయాలని మంత్రి గంటా శ్రీనివాసరావు ఆదేశాలను జారీచేశారు. ఆ ప్రకారం ఎంపికైన అభ్యర్థులు వెబ్‌కౌన్సెలింగ్ కోసం జిల్లాకు ప్రత్యేకంగా సర్వర్లను ఏర్పాటుచేసినట్లు విద్యాశాఖ సిబ్బంది వెల్లడిస్తున్నారు. సోమ, మంగళవారాల్లో అభ్యర్థులు వెబ్‌కౌన్సెలింగ్ ద్వారా తమకు కావాల్సిన స్కూళ్లను కోరుకోవడానికి అవకాశం వుంటుంది. ఆ తర్వాత మే 30 లేదా జూన్ 1న వారికి కేటాయించిన పాఠ శాల పేరును రాష్ట్ర విద్యాశాఖ నేరుగా అభ్యర్థుల సెల్‌ఫోన్లకు మెసేజ్ ద్వారా అందజేస్తుంది. ఈ ఏడాది సరికొత్త విధానంతో ఆన్‌లైన్ ద్వారా ఎంపికైన అభ్యర్థులకు డీఈవో డిజిటల్ సంతకంతో కూడిన నియామక పత్రాలను అందివ్వనున్నారు. అనంతరం  నూతనంగా బాధ్యతలను  స్వీకరించనున్న టీచర్లకు జిల్లాలో జూన్ 3 నుంచి 11 వరకు శిక్షణ ఇవ్వనున్నారు.  

 
ఎంపికైన నూతన టీచర్ పోస్టుల వివరాలు

జిల్లాలో ఖాళీగా ఉన్న 1421 పోస్టుల్లో డీఎస్సీ-2014 ద్వారా 1,335 పోస్టులను భర్తీ చేయనున్నారు. అందు లో ఎస్జీటీ తెలుగు -945 ఖాళీలకు-938 మందిని, తమిళం-3 ఖాళీలకు 2, ఉర్దూ-75 ఖాళీలకు 29 మందిని, భాషా పండితులకు గాను తెలుగులో 65 ఖాళీలకు గాను 64 మందిని, హిందీలో 80కి 80 మందిని, ఉర్దూలో 20కి 10 మందిని, సంస్కృతంలో 1 ఖాళీకి ఒకరిని, స్కూల్ అసిస్టెంట్ గణిత ం తెలుగు మీడియంలో 58 ఖాళీలకు 58 మందిని, ఉర్దూలో 8 ఖాళీలకు ముగ్గురిని నియమిస్తున్నారు. తమిళంలో 2 ఖాళీలకు, ఫిజికల్ సైన్స్ ఉర్దూలో- 2 ఖాళీలకు, బయాలజికల్ సైన్స్‌లో-2 పోస్టులకు  ఎవరినీ ఎంపిక చెయ్యలేదు, సోషల్‌స్టడీస్ తెలుగు మీడియంలో 95 ఖాళీలకు 95 మందిని, ఉర్ధూలో 5 మందికి ఒకరిని, తమిళంలో 2 ఖాళీలకు ఒకరిని, స్కూల్ అసిస్టెంట్  తెలుగులో 23 ఖాళీలకు 23 మందిని, హిందీలో 5 ఖాళీలకు 5 మందిని, ఇంగ్లీషులో 18 ఖాళీలకు 17 మందిని, తమిళంలో 1 ఖాళీకి ఒకరిని, పీఈటీ తెలుగు మీడియంలో 7 ఖాళీలకు ఏడుగురిని ఎంపికచేస్తున్నారు. ఉర్దూ మీడియంలో 4 ఖా ళీలండగా ఎవరినీ నియమించలేదు. మొత్తం 1,421 ఖాళీలకు 1,335 మంది టీచర్లను నియమించనున్నారు.

 
విజయవాడలో ప్రతిజ్ఞ

డీఎస్సీ-2014 ద్వారా ఎంపికై బాధ్యతలు స్వీకరించనున్న ఉపాధ్యాయులతో  ముఖ్యమంత్రి ప్రతిజ్ఞ చేయిస్తారు. జూన్ 1వ తేదీ సాయంత్రం 3 గంటలకు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో జరిగే ఈ కార్యక్రమానికి అంతా తప్పకుండా హాజరుకావాలి. అదేరోజు ఉదయం జిల్లా అభ్యర్థులు విజయవాడలో ఎంజీ రోడ్డులో ఉన్న చిల్డ్రన్ మాంటెస్సోరీ స్కూల్ వద్దకు వెళ్లి తమ పేర్లను నమోదు చేసుకోవాలి. ఒకటో తేదీలోపు అంద రూ ఆన్‌లైన్‌లో apdsc.cgg.gov.in వెబ్‌సైట్‌లో నియమాకపత్రాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement