జూన్ మొదటి వారంలో డీఎస్సీ ఫలితాలను వెలువరించి, సాధ్యమైనంత త్వరగా ఉపాధ్యాయ నియామకాలను చేపట్టనున్నట్లు విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తమకు హామీ ఇచ్చారని ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
గుంటూరు: జూన్ మొదటి వారంలో డీఎస్సీ ఫలితాలను వెలువరించి, సాధ్యమైనంత త్వరగా ఉపాధ్యాయ నియామకాలను చేపట్టనున్నట్లు విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తమకు హామీ ఇచ్చారని ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉపాధ్యాయుల రేషనలైజేషన్, బదిలీలపై ఆయనను ఇటీవల పీడీఎఫ్ ఎమ్మెల్సీలంతా కలసి విన్నవించగా ఈ విషయం తెలిపారని పేర్కొన్నారు. జూన్ 4వ తేదీన ఎమ్మెల్సీలతో సమావేశం కూడా నిర్వహించనున్నట్లు మంత్రి వివరించారని చెప్పారు.
ఈనెల 9, 10,11వ తేదీల్లో ఏపీ డీఎస్సీ-2014 జరిగిన విషయం విదితమే.