
బాపు-ఆర్.నారాయణ మూర్తి
హైదరాబాద్: ప్రముఖ చిత్రకారుడు, దర్శకుడు బాపు మరణంతో ఒక శకం ముగిసిందని విప్లవ దర్శకుడు ఆర్.నారాయణ మూర్తి అన్నారు. ఆయన సాక్షి టీవీతో మాట్లాడుతూ ఏడుపు వస్తుందని చెప్పారు. బాపు మహా దర్శకుడు, మహా చిత్రకారుడు అన్నారు. గుంటూరు గోంగూర ఎంత ప్రాముఖ్యమో, ఓరుగల్లు కాకతీయత ఎంత ప్రాముఖ్యమో, బాబు బొమ్మ అంత ప్రాముఖ్యమైనదన్నారు. తెలుగు జాతికి కీర్తి ప్రతిష్టలు తెచ్చారని కొనియాడారు.
బాపు మంచి మనిషి. నవ్వుతూ మాట్లాడతారు. సామాన్య మనిషిగా మాట్లాడతారు. గొప్ప మనిషి. గొప్ప సినిమాలు తీశారు. సాక్షి నుంచి శ్రీరామరాజ్యం వరకు ఆయన చిత్రాలలో తెలుగుదనం ఉట్టిపడుతుందన్నారు. బాపు మరణం యావత్ తెలుగుజాతికి తీరని లోటు. అన్నారు. బాపుకు భారత ప్రభుత్వం పద్మశ్రీ ఇచ్చిందని, ఆయనకు అది సరిపోదని,. పద్మభూషణ్ గాని పద్మవిభూషణ్ గానీ ఇవ్వాలని నారాయణ మూర్తి అన్నారు.