
'సీఎం రాజీనామా వార్తలు ఊహాగానాలే'
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా వార్తలు ఊహాగానాలే అని మంత్రులు టీజీ వెంకటేష్, ఏరాసు ప్రతాప్ రెడ్డి అన్నారు. సోమవారం వీరు ఇరువురు ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. అనంతరం టీజీ, ఏరాసు మీడియాతో మాట్లాడుతూ విభజన బిల్లుపై రాష్ట్రపతి నిర్ణయం తర్వాతే ముఖ్యమంత్రి భవిష్యత్ కార్యచరణ ఉంటుందని అన్నారు.
కాగా కేంద్ర కేబినెట్ ఆమోదించిన ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లును ఆదివారం రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ కార్యాలయానికి చేరటం, ఆ వెంటనే ఆయన దానిపై సంతకం కూడా చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వ వర్గాలకు నిన్న రాత్రే సమాచారం అందింది. బిల్లును మంగళవారం రాజ్యసభలో ప్రవేశపెట్టే పరిస్థితి ఉందన్న సంకేతాలూ సీఎం వర్గీయులకు అందాయి. కాగా రాష్ట్రపతి నిర్ణయం తర్వాతే సీఎం ముందుకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.