సీఎం కిరణ్ సెల్ఫోన్ స్విచ్ఛాఫ్! | kiran kumar reddy cell phone switch off? | Sakshi
Sakshi News home page

సీఎం కిరణ్ సెల్ఫోన్ స్విచ్ఛాఫ్!

Published Tue, Feb 18 2014 11:52 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM

సీఎం కిరణ్ సెల్ఫోన్ స్విచ్ఛాఫ్! - Sakshi

సీఎం కిరణ్ సెల్ఫోన్ స్విచ్ఛాఫ్!

హైదరాబాద్ : కిరణ్ కుమార్ రెడ్డి మంగళవారం ముఖ్యమంత్రి పదవికి  రాజీనామా చేస్తారంటూ వార్తలు జోరందుకున్న నేపథ్యంలో ఆయన సెల్ ఫోన్ స్విచ్ఛాఫ్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన కేవలం క్యాంప్ కార్యాలయానికే పరిమితం అయ్యారు. సందర్శకులను కూడా కిరణ్ అనుమతించటం లేదని సమచారం.

మరో వారం, పది రోజుల్లో సాధారణ ఎన్నికలకు షెడ్యూలు ప్రకటించే అవకాశం ఉండటం, కొద్ది రోజులుగా ఒక్కొక్కటిగా పనులు చక్కబెట్టుకుంటూ వస్తున్న నేపథ్యంలో కిరణ్‌కుమార్‌రెడ్డి  నేడు తన పదవికి రాజీనామా చేయనున్నట్లు బలంగా ప్రచారం జరుగుతోంది. సీఎంకు సన్నిహితంగా ఉండే కొందరు మంత్రులు కూడా ఈ విషయాన్ని బహిరంగంగానే చెబుతున్నారు.  విభజన బిల్లును కేంద్రం లోక్‌సభలో ప్రవేశపెట్టిన సమయంలో కిరణ్ రాజీనామాపై ప్రచారం బలంగా సాగింది. అయితే, లోక్‌సభలో బిల్లు ప్రవేశపెట్టలేదన్న బీజేపీ వాదనను సాకుగా చూపించి, ఆయన రాజీనామాను చివరి వరకు సాగదీస్తూ వచ్చారు.

కిరణ్ తన రాజీనామాపై ఇప్పటికే విస్తృతస్థాయిలో ప్రచారం కల్పించుకున్న నేపథ్యంలో ఇక తప్పుకోకపోతే పరువు పోతుందన్న అభిప్రాయానికి వచ్చినట్లు సహచర మంత్రులు చెబుతున్నారు. మంగళవారం మధ్యాహ్నం లోక్‌సభలో తెలంగాణ బిల్లుపై  చర్చ ముగిసి ఓటింగ్ జరగడానికి ముందు రాజీనామా చేసే అవకాశముందని, గవర్నర్‌ను కలిసి రాజీనామా లేఖ ఇస్తారని సీఎం సన్నిహిత నేతలు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement