మనస్తాపంతో రైతు ఆత్మహత్య | Farmer commits suicide | Sakshi
Sakshi News home page

మనస్తాపంతో రైతు ఆత్మహత్య

Published Sat, Sep 19 2015 2:03 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

Farmer commits suicide

తనకు జీవనాధారమైన వ్యవసాయ భూమిని కొల్లగొట్టేందుకు బంధువులు ప్రయత్నాలు చేస్తుండడంతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం మేనకూరులో మస్తానయ్య (70) అనే రైతు శనివారం ఉదయం తన ఇంట్లో ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. మస్తానయ్యకు 3 ఎకరాల వరకు పొలం ఉంది. అయితే, ఆ భూమి తమదంటూ బంధువులు పట్టాదారు పాస్‌పుస్తకాలు సృష్టించారు. అధికారులు కూడా వారికి సహకరిస్తుండడంతో మస్తానయ్య మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్టు కుటుంబ సభ్యులు ఆరోపింస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement