గుండెపోటుతో రైతు మృతి | farmer dies of heart attack in ananthapuram district | Sakshi
Sakshi News home page

గుండెపోటుతో రైతు మృతి

Published Tue, Feb 3 2015 5:03 PM | Last Updated on Mon, Oct 1 2018 4:01 PM

farmer dies of heart attack in ananthapuram district

అనంతపురం: రుణమాఫీ కోసం అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో ఆవేదనకు గురైన  ఓ రైతు గుండెపోటుతో మృతి చెందాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లా కూడేరు మండలం ఇప్పెరులో సోమవారం రాత్రి జరిగింది. వివరాలు.. ఇప్పెరు గ్రామానికి చెందిన ఏకుల గోపాల్(50) రుణమాఫీ కోసం 20 రోజులుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు.

అధికారుల నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాడని కుటుంబ సభ్యులు తెలిపారు. సోమవారం రాత్రి గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు 108లో అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో అతను మృతి చెందాడు.
(కూడేరు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement