గుంటూరు: గ్రామాల్లో నిర్వహిస్తున్నరైతు సాధికారి సదస్సు పై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నెట్‌ల ద్వారా వచ్చిన సమాచారాన్ని పత్రంలో చేర్చి రైతులకు అందజేయడాన్ని వారు తప్పుబడుతున్నారు. ఆ రుణ విముక్తి పత్రాల వల్ల పైసా కూడా ఉపయోగం ఉండడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం పిడుగురాళ్ల మండలం కోనంకిలో రైతు సాధికార సదస్సు నిర్వహించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు ఈ సదస్సు తమకొద్దంటూ బ్యానర్లు చించివేశారు.
'సీఎం తొలిసారి చేసిన సంతకమే చెల్లలేదని.. ఇక మీరిచ్చి బాండ్లు ఎలా చెల్లుతాయంటూ' రైతులు అధికారులను నిలదీశారు. దీంతో చేసేది లేక అర్ధాంతరంగా కార్యక్రమాన్ని ముగించుకుని అధికారులు వెనుదిరిగారు.