భార్యపై అనుమానంతో ఓ వ్యక్తి ఆమెతోపాటు కన్న కూతురిని కూడా కత్తితో నరికి చంపిన ఘటన శనివారం ఉదయం వెలుగు చూసిన సంగతి తెలిసిందే.
నగరం (గుంటూరు) : భార్యపై అనుమానంతో ఓ వ్యక్తి ఆమెతోపాటు కన్న కూతురిని కూడా కత్తితో నరికి చంపిన ఘటన శనివారం ఉదయం వెలుగు చూసిన సంగతి తెలిసిందే. అయితే అతడి ఏడేళ్ల వయసున్న కుమారుడు కనిపించకుండాపోయాడు.ఆ రాక్షసుడు కుమారుడిని కూడా వదిలిపెట్టలేదు. తండ్రి చేతుల్లో హతమైన చిన్నారి మృతదేహం ఆదివారం ఉదయం గుంటూరు జిల్లా నగరం మండలం చిరకాలవారిపాలెంలోవెలుగుచూసింది.
చిరకాలవారిపాలెంకు చెందిన ఉప్పాల వెంకట శివరామకృష్ణ, తిరుపతమ్మ దంపతులకు యశ్వంత్ (7), నాగశ్రీ (5) సంతానం. అయితే భార్య వేరొక వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందన్న కారణంతో శివరామకృష్ణ శుక్రవారం అర్ధరాత్రి భార్య తిరుపతమ్మ, కుమార్తె నాగశ్రీలను కత్తితో నరికి చంపాడు. తిరుపతమ్మ మృతదేహం ఇంట్లోనే వెలుగుచూడగా... నాగశ్రీ మృతదేహాన్ని గ్రామం వెలుపల గుర్తించారు. కాగా యశ్వంత్ మృతదేహం గ్రామం సమీపంలోని పంట కాల్వలో ఆదివారం ఉదయం స్థానికుల కంటపడింది. వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. నిందితుడు శివరామకృష్ణ పరారీలో ఉన్నాడు. అతడు పట్టుబడితే హత్యల వెనుకనున్న కారణాలు స్పష్టంగా తెలుస్తాయని పోలీసులు అంటున్నారు.