
ఆందోళనలో అన్నదాతలు
పులివెందుల సబ్ డివిజన్ పరిధిలో రోజు రోజుకు విద్యుత్ కోతలు తీవ్రమవుతున్నాయి. దీంతో పంటలకు సాగునీరు అందక రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఆందోళనలో అన్నదాతలు
వేముల,
పులివెందుల సబ్ డివిజన్ పరిధిలో రోజు రోజుకు విద్యుత్ కోతలు తీవ్రమవుతున్నాయి. దీంతో పంటలకు సాగునీరు అందక రైతులు ఆందోళన చెందుతున్నారు. కాగా ఈ ఏడాది తుపాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురిశాయి. వాగులు, వంకలు ప్రవహిం చి చెరువులు నిండాయి. దీంతో భూగర్భజలా లు పెరిగి వ్యవసాయ బోర్లలో నీరు సమృద్ధిగా వస్తోంది. ఎండిపోయిన వ్యవసాయ బోర్లకు వర్షాల రాకతో మళ్లీ ఊపిరి వచ్చింది. గత మూ డేళ్లు నష్టాలనే ఎదుర్కొన్న రైతులు ఈ ఏడాది విస్తారంగా పంటలను సాగు చేశారు. బోర్ల కింద వేరుశనగ, ఉల్లి, నువ్వుల పంటలు విస్తారంగా సాగయ్యాయి. మూడేళ్లపాటు సాగునీరు లేక నష్టపోయిన రైతులు ఈ ఏడాది విద్యుత్ కోతలవలన నష్టపోవాల్సి వస్తోంది. రోజు రోజుకు విద్యుత్ కోతలు తీవ్రమవుతున్నాయి. ఒక్కరోజు పగలు 2గంటలు కూడా విద్యుత్ సరఫరా కావడంలేదు. రాత్రి సమయాల్లో ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి. రబీ వేరుశనగ ఊడలు దిగుతుండగా.. ఉల్లి పంట గడ్డలతోనూ.. నువ్వుల పంట పూతతో ఉంది. విద్యుత్ కోతలతో పంటలకు సకాలంలో రైతులు నీటితడులను అందించలేకపోతున్నారు. దీంతో దిగుబడులు తగ్గే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఒకసారి సరఫరాపోతే 3గంటల నుంచి 4గంటలపాటు కోత విధిస్తున్నారు. సబ్‌స్టేషన్ల పరిధిలో షిప్టుల వారీగా విద్యుత్ సరఫరాతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్ కోతలు ఇలాగే ఉంట ఈ ఏడాది నష్టపోతామని రైతులు మదనపడుతున్నారు.
అధికమైన అప్రకటిత విద్యుత్ కోతలు
సింహాద్రిపురం, న్యూస్‌లైన్ : మండలంలోని అప్రకటిత విద్యుత్ కోతలు అధికమయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్ ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో ఎవరికి తెలియని పరిస్థితి నెలకొం ది. మండల కేంద్రంలో కూడా మరీ పరిస్థితి దా రుణంగా ఉంది. ఈ విషయమై ఏఈ రవీంద్రప్రసాద్‌ను వివరణ కోరగా మెయిన్‌లైన్ సరఫరాలో అంతరాయం కలుగుతుందన్నారు. 7గంటల వ్యవసాయ విద్యుత్‌ను రైతులకు ఇబ్బంది కలగకుండా సరఫరా చేస్తామని పేర్కొన్నారు.