'షార్' లో వివాదం | Fight breaks out between contract labour and CSF Police at SHAR | Sakshi
Sakshi News home page

'షార్' లో వివాదం

Published Mon, Jun 8 2015 4:45 PM | Last Updated on Sun, Sep 3 2017 3:26 AM

Fight breaks out between contract labour and CSF Police at SHAR

శ్రీహరికోట (నెల్లూరు) : షార్‌లో పని చేసే కాంట్రాక్ట్ లేబర్, సీఎస్‌ఎఫ్ పోలీసులకు మధ్య వివాదం చెలరేగింది. ఈ సంఘటన సోమవారం శ్రీహరికోటలోని షార్‌లో వెలుగుచూసింది. వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన కొంతమంది కార్మికులు శ్రీహరికోట షార్‌లో కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పని చేస్తున్నారు. కాగా ఆదివారం శెలవు కావడంతో 10 మంది కార్మికులు సాయంత్రం షార్ పరిసర ప్రాంతాల్లో మద్యం సేవిస్తున్నారు. అదే సమయంలో అక్కడ విధుల్లో ఉన్న ఒక సీఎస్‌ఎఫ్ కానిస్టేబుల్ ఇది చూసి వారిని దూషించారు. దీంతో ఆగ్రహించిన కార్మికులు అతనిపై దాడి చేశారు. ఈ విషయం మరి కొంతమంది సీఎస్‌ఎఫ్ కానిస్టేబుల్స్‌కు తెలియడంతో వారు అక్కడికి చేరుకున్నారు. విషయం పెద్దదై పరస్పరం ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నట్లు సమాచారం. ఈ విషయంపై సోమవారం కార్మికులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లినట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement