మంజీరా తీరంలో సరిహద్దు రగడ | fighting in Manjira coast border | Sakshi
Sakshi News home page

మంజీరా తీరంలో సరిహద్దు రగడ

Published Sat, Feb 1 2014 6:37 AM | Last Updated on Fri, Jul 12 2019 6:01 PM

ఆంధ్ర- మహారాష్ట్ర సరిహద్దుల మధ్య ప్రవహిస్తున్న మంజీరా నదిలో సరిహద్దు వివాదం రాజుకుంటోంది.

బోధన్,న్యూస్‌లైన్: ఆంధ్ర- మహారాష్ట్ర సరిహద్దుల మధ్య ప్రవహిస్తున్న మంజీరా నదిలో సరిహద్దు వివాదం రాజుకుంటోంది. మహారాష్ట్ర సరిహద్దులో మంజీరా నది ఒడ్డున ఉన్న బోధన్ మండలంలోని మందర్నా గ్రామస్తులు శనివారం ఆందోళనకు దిగారు. హద్దు దాటి రాష్ట్ర భూభాగంలో ఇసుక తవ్వుతున్నారని ఆరోపించారు. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు మంజీరా నదిలో బైఠాయించి ధర్నా చేపట్టారు. విషయం తెలుసుకున్న మహారాష్ట్ర ఇసుక క్వారీ నిర్వాహకులు గ్రామస్తులతో చర్చించేందుకు వచ్చారు.

దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తమ పరిధిలోనే నిబంధనల ప్రకారం ఇసుక తవ్వకాలు చేపట్టామని నిర్వాహ వాదించారు. సరిహద్దు విషయంలో అనుమానాలుంటే అధికారులతో రీ సర్వే చేయించుకోవాలన్నారు. కాగా మందర్నా గ్రా మానికి మంజీర నదికి ఆవతలి ఒడ్డున మహా రాష్ట్ర భూభాగంలోని సగ్రోలి ఇసుక క్వారీల్లో అక్కడి కాంట్రాక్టర్లు కొన్ని రోజుల నుంచి ఇసుక తవ్వకాలు ప్రారంభించారు. దీనికి మందర్నా గ్రామస్తులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు.

వారం రోజుల క్రితమే గ్రామస్తులు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టగా కలెక్టర్ ఆదేశాల మేరకు మండల రెవెన్యూ అధికారులు, సర్వేయర్లు మంజీర నదిలో సర్వే చేసి హద్దులు చూపెట్టారు. అయితే అధికారుల సర్వేపట్ల గ్రామస్తులు అసంతృఫ్తి వ్యక్తం చేశారు. ఈ సర్వే సక్రమంగాలేదని ఆరోపించారు. ఈక్రమంలో మం జీర తీరంలో వివాదం చెలరేగింది.

 ‘మహా’ ఇసుక క్వారీల్లో తవ్వకాలు షురూ..
 మహారాష్ట్ర భూభాగంలోని మంజీర నదిలో ఇసుక క్వారీల కు వేలంపాట వేసిన అక్కడి ప్రభుత్వం కాంట్రాక్టర్లకు ఇ సు క రవాణకు అనుమతి ఇచ్చింది. బోధన్ మండలంలో ని మందర్నా, హున్సా, ఖాజాపూర్, సాలూర, తగ్గె  లి, క ల్దుర్కి, సిద్దాపూర్ గ్రామాలకు అనుకుని మంజీరా నది ప్ర వహిస్తోంది. ఈ ప్రాంతాలకు ఆవతలి ఒడ్డున మహారాష్ట్ర భూభాగంలోని నదిలో పదికిపైగా ఇసుక క్వారీ లున్నాయి.

ఈ ఏడాది బోధన్ మండలానికి సరిహద్దులోని నాం దేడ్ జిల్లా బిలోలి తాలూకా పరిధిలోని ఉన్న ఎస్గీ, గంజ్‌గావ్, సగ్రోలి, శెల్‌గావ్ క్వారీలకు వేలంపాటు ల నిర్వహించిది. కాంట్రాక్టులు దక్కించుకున్న వారికి ఇసుక తవ్వకాలకు అనుమతిచ్చింది. కాంట్రాక్టర్లు పక్షం రోజుల నుం చి నదిలో ర్యాంప్‌లు, రోడ్లు వేసుకుని ఇసుక రవాణా ప్రా రంభించారు. మహా క్వారీల నుంచి ఇసుక లోడ్‌తో వస్తు న్న టిప్పర్లు, లారీలు సాలూర అంతరాష్ట్ర చెక్‌పోస్టు మీదు గా మన రాష్ట్రంలోకి ప్రవేశిస్తున్నాయి. అక్కడి వే బిల్లులపై రవాణాకు అనుమతి ఇస్తున్నారు. కాగా భారీ లోడ్‌లతో ఇసుక వాహనాల రాకపోకలవల్ల మన రాష్ట్ర ప్రభుత్వం రూ. కోట్లతో నిర్మించిన రోడ్లు దెబ్బతింటున్నాయి.

 తీవ్రస్థాయిలో ఆరోపణలు
 మహారాష్ట్ర క్వారీల నుంచి ఇసుక రవాణపై గతేడాది తీవ్ర స్థాయిలో ఆరోపణలు వచ్చాయి. దీంతో 2013 జనవరి మొదటి వారంలో సాలూర అంతరాష్ట్ర చెక్‌పోస్టును సందర్శించిన జిల్లా జాయింట్ కలెక్టర్ హర్షవర్ధన్ ఇసుక రవాణపై నిఘా పెట్టాలని ఆదేశించారు. చెక్‌పోస్టు వద్ద రెవెన్యూ సిబ్బందిని నియమించాలని ఆదేశించినప్పటికీ ఆచరణలో మాత్రం అమలు కాలేదు. దీంతో యథేచ్ఛగా ఇసుక రవాణా కొనసాగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement