గుంటూరు: మాట్రిక్స్ బయోమాస్ పరిశ్రమలో బుధవారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. వివరాలు.. గుంటూరు జిల్లాలోని కారంపూడిలో ఓ పరిశ్రమలో వ్యర్ధ పదార్థాలతో విద్యుదుత్పత్తి జరుగుతోంది. విద్యుదుత్పత్తికి అవసరమైన వ్యర్ధ పదార్ధాలకు నిప్పు అంటుకోవడంతో పరిశ్రమలో మంటలు రేగినట్టు తెలుస్తోంది. ఉద్దేశపూర్వకంగా ఎవరైనా నిప్పు పెట్టారా ? లేక ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎండలు తీవ్రంగా ఉండటంతో మంటలు వేగంగా వ్యాప్తి చెందాయి. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.
(కారంపూడి)
మాట్రిక్స్ బయోమాస్ పరిశ్రమలో అగ్నిప్రమాదం
Published Wed, May 27 2015 4:49 PM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM
Advertisement
Advertisement