ఉట్నూర్, న్యూస్‌లైన్ : ఐటీడీఏ ఆధీనంలోని గిరిజన సంక్షేమశాఖ ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను చదువుతోపాటు క్రీడల్లో ప్రోత్సహించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం రూ.48.68 లక్షలు కేటాయించింది. అధికారులు టెండర్లు నిర్వహించి విద్యార్థులకు క్రీడా సామగ్రి అందించనున్నారు. క్రీడా సామగ్రి అందుబాటులో ఉండనుండటంతో విద్యార్థులు క్రీడల్లో రాణించే అవకాశం ఉంది.
కేటగిరీలవారీగా నిధులు విడుదల
జిల్లా వ్యాప్తంగా 123 ఆశ్రమ పాఠశాలల్లో దా దాపు 37,613 గిరిజన విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. జిల్లాలోని ఆశ్రమ పాఠశాలలను ఏ, బీ గ్రేడుల కింద 113 ఆశ్రమాలను ప్రభుత్వం గుర్తించింది. ఒక్కో ఆశ్రమ పాఠశాలకు దాదాపు రూ.43,082 వెచ్చించి పరికరాలు కొనుగోలు చేయనున్నారు. ప్రతీ ఆశ్రమ పాఠశాలకు ఇన్‌డో ర్ క్రీడల కోసం ఆరు రకాలు, ఔట్ డోర్ క్రీడల కు ఎనిమిది రకాల క్రీడా వస్తువులు, అథ్లెటిక్ క్రీడల పరికరాల్లో గ్రేడ్-ఏ ఆశ్రమాలకు 12రకా లు, గ్రేడ్-బీ ఆశ్రమాలకు 14 రకాల కీడ్రా వస్తువులు ఐటీడీఏ అందించనుంది. నిధులను కూ డా ప్రభుత్వం ఆశ్రమాలను ఏ,బీ కేటగిరీలుగా విభజించి కేటాయించింది. జిల్లాలో కేటగిరీ- ఏ కింద 19 బాలుర ఆశ్రమ పాఠశాలలను గుర్తిం చి రూ.9,99,970, కేటగిరీ-బీ కింద 57 బాలుర ఆశ్రమాలను గుర్తించి రూ.25,41,060, కేటగిరీ -ఏ కింద 22 బాలికల ఆశ్రమాలను గుర్తించి రూ.8,24,340, కేటగిరీ-బీ కింద 15 బాలికల ఆశ్రమాలు గుర్తించి రూ.5,02,950 చొప్పున విడుదల చేయనుంది.
ఖాళీలు భర్తీ అయితేనే..
ప్రభుత్వ నిర్ణయం బాగుంది. ఆశ్రమ పాఠశాలల్లో గ్రేడ్-2 ఫిజికల్, పీఈటీ పోస్టులు పూర్తిస్థాయిలో భర్తీ అయితేనే విద్యార్థులకు క్రీడల్లో న్యాయం జరిగే అవకాశం ఉంది. పీడీ, పీఈటీ పొస్టులు భర్తీ లేకుండా క్రీడా పరికరాలు ఇస్తే ఫ లితం ఉండదు. జిల్లావ్యాప్తంగా ఉన్న ఆశ్రమా ల్లో ఫిజికల్ డెరైక్టర్ పోస్టులు 69ఉండగా కేవలం 19మంది విధులు నిర్వహిస్తున్నారు. 50పోస్టు లు ఖాళీగా ఉన్నాయి. అలాగే పీఈటీ పోస్టులు 22 ఉండగా 8 మంది విధులు నిర్వహిస్తుండగా, మిగతా 14 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటికితోడు గత ఆగస్టులో ప్రభుత్వం ఐటీడీఏ గిరిజన సంక్షేమ శాఖలో ఉపాధ్యాయ ఖాళీల భర్తీలో భాగంగా 28 పీడీ, 17 పీఈటీ పోస్టులు భర్తీ చేస్తున్నట్లు ప్రకటించినా ఇంతవరకు ఏ రకమైన చర్యలు తీసుకోలేదు. ఆశ్రమాల్లో పూర్తిస్థాయిలో పీడీ, పీఈటీ పోస్టులు భర్తీ అయితేనే క్రీడల్లో న్యాయం జరుగుతుందని ఆశ్రమ పాఠశాలల విద్యార్థులు పేర్కొంటున్నారు.
క్రీడలకు నిధులు
Published Thu, Dec 19 2013 6:01 AM | Last Updated on Sat, Sep 2 2017 1:46 AM
Advertisement
Advertisement