బాలకృష్ణకు గన్ని అల్పాహార విందు | Ganni Krishna Breakfast and dinner to Hero Balakrishna | Sakshi
Sakshi News home page

బాలకృష్ణకు గన్ని అల్పాహార విందు

Published Sun, Jan 24 2016 2:44 AM | Last Updated on Sun, Sep 3 2017 4:10 PM

బాలకృష్ణకు గన్ని అల్పాహార విందు

బాలకృష్ణకు గన్ని అల్పాహార విందు

రాజమహేంద్రవరం సిటీ : ‘డిక్టేటర్’ విజయోత్సవ యాత్రలో భాగంగా నగరానికి వచ్చిన సినీ హీరో బాలకృష్ణకు టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి గన్ని కృష్ణ శనివారం ఉదయం అల్పాహారవిందు ఇచ్చారు. బాలకృష్ణ గన్ని ఇంటివద్ద ఉన్న ఎన్‌టీఆర్, గన్ని సత్యన్నారాయణమూర్తిల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
 
 అనంతరం మాట్లాడుతూ ‘డిక్టేటర్’ విజయం తనకెంతో ఆనందాన్నిచ్చిందన్నారు. త్వరలో తన కుమారుడు మోక్షజ్ఞను హీరోగా పరిచయం చేయనున్నట్లు తెలిపారు. కాగా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేశారు. లారీ డ్రైవర్లకు దుస్తులు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మురళీమోహన్, మేయర్ పంతం రజనీ శేషసాయి, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, సినీ దర్శకుడు శ్రీవాస్ పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement