ఎక్కడి ఫైళ్లు అక్కడే!
Published Fri, Nov 15 2013 1:54 AM | Last Updated on Sat, Sep 2 2017 12:36 AM
రిమ్స్‌క్యాంపస్, న్యూస్‌లైన్ : జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారి కార్యాల యంలో చాలా ఫైళ్లు పెండింగ్‌లో ఉండిపోవటం వివాదాలకు కారణమవుతోంది. డీఎంహెచ్‌ఓ డాక్టర్ గీతాంజలి వ్యవహార శైలిపై ఉద్యోగులు మండిపడుతున్నారు. మెడికల్ రీయింబర్స్‌మెంట్, సరెండర్ లీవ్‌లు, కారుణ్య నిమాయకాలకు సంబంధించిన ఫైళ్లు నెలల తరబడి పెండింగ్‌లో ఉండిపోవటంతో ఇబ్బందులు పడుతున్నామని, అయినా ఆమె పట్టించుకోవటం లేదని విమర్శిస్తున్నారు. దీంతో కార్యాలయంలో పరిస్థితి చినుకు చినికి గాలివానలా తయరయ్యేలా ఉంది. జిల్లావైద్యఆరోగ్యశాఖ కార్యాలయంలో నైట్‌వాచ్‌మెన్‌గా పనిచేసిన బహుదుర్ దాదాపు ఏడాది క్రితం అనారోగ్యంతో చనిపోయారు. ఆయనకు సంబంధించిన మెడికల్ రీయింబర్స్‌మెంట్,
ఇతర ప్రయోజనాలను కుటుంబ సభ్యులకు ఇంతవరకు చెల్లించలేదు. కారుణ్య నియామకం కింద ఆయన కుమారుడికి ఉద్యోగమూ ఇవ్వలేదు. దీంతో ఆయన కుటుంబసభ్యులు కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. జిల్లా కేంద్రంలో పనిచేసినవారి పరిస్థితే ఇలా ఉంటే పీహెచ్‌సీల్లో పనిచేసే వారి దుస్థితి ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చని ఉద్యోగులు అంటున్నారు.
అస్మదీయులకు పెద్దపీట
నెలల తరబడి పెండింగ్‌లో ఉన్న ఫైళ్లను పరిష్కరించని డీఎంహెచ్‌ఓ, తన వెనుక తిరుగుతున్నవారి పనులను మాత్రం త్వరిత గతిన పూర్తి చేస్తున్నారని పలువురు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. సొమ్ము ఇస్తే గాని సంతకాలు పెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పదోన్నతి కోసం ఓ ఉద్యోగి రూ.40 వేలు ఇచ్చినా ఇంకా పనిచేసి పెట్టలేదన్న ఆరోపణలు ఉన్నాయి. తనకు న్యాయంగా రావాల్సిన పదోన్నతి ఇవ్వటానికి కూడా డబ్బు అడిగారని, సొమ్ము ఇచ్చినా పని చేయలేదని ఆ ఉద్యోగి వాపోతున్నట్టు సమాచారం. యూనియన్ నేత ఒకరు నిత్యం డీఎంహెచ్‌ఓ పక్కనే ఉంటూ తమవారి పనులను చక్కబెట్టుకుంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఓ పీహెచ్‌సీలో పనిచేస్తున్న ఆయన అక్కడి విధులను విస్మరించి డీఎంహెచ్‌ఓ పనులు చేసిపెడుతూ పబ్బం గడుపుకుంటున్నారని చెబుతున్నారు.
Advertisement
Advertisement