గోదావరి వరద మరోసారి ఉధృతంగా పెరుగుతోంది. ఎగువనున్న శ్రీరామ్‌సాగర్ నుంచి వరదనీరు విడుదల చేస్తుండడంతో గోదావరి నీటిమట్టం పెరుగుతోంది.
వాజేడు,న్యూస్‌లైన్:
గోదావరి వరద మరోసారి ఉధృతంగా పెరుగుతోంది. ఎగువనున్న శ్రీరామ్‌సాగర్ నుంచి వరదనీరు విడుదల చేస్తుండడంతో గోదావరి నీటిమట్టం పెరుగుతోంది. గోదావరి ఎగపోటు కారణంగా మండల పరిధిలోని చీకుపల్లి వద్ద రహదారిపైకి వదర నీరు చేరింది. ఆదివారం ఉదయం 6 గంటలకు రహదారిపైకి వరద నీరు చేరటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. చప్టాకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. చీకుపల్లివాగుకు అవతలిపై వైపు ఉన్న 25 గ్రామాలకు రాకపోకలు స్తంభిం చాయి.
నాటుపడవలు ఏర్పాటు చేసి ప్రయాణికులను తరలిస్తున్నారు. కొందరు వరదనీటి నుంచే దాటుతున్నారు. కూలీలను ట్రాక్టర్ల ద్వారా దాటించారు. గోదావరికి ఎగువ ప్రాం తం నుంచి వరద నీరు ఇంకా వస్తుండటంతో మరింత పెరిగే అవకాశం ఉంది. ఆదివారం రాత్రి మండల పరిధిలోని పేరూరు వద్ద గోదావరి నీటి మట్టం 9.750 మీటర్లుగా ఉంది. గోదావరి ఉధృతితో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.